NEET PG 2021 Admissions: దేశవ్యాప్తంగా మెడికల్ పీజీ కోర్సుల అడ్మిషన్స్ ప్రక్రియ మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానుంది. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష 2021 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు పీజీ మెడికల్ అడ్మిషన్ ప్రక్రియ ఇలా ఉండనుంది.
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ లేదా పీజీ మెడిసిన్ వైద్య విద్యలో అడ్మిషన్‌కు జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష అంటే నీట్లో అర్హత తప్పనిసరి. NEET PG 2021కు సంబంధించి అంటే ఈ ఏడాది పీజీ మెడిసిన్ అడ్మిషన్ల ప్రక్రియకు కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. పీజీ నీట్ 2021లో అర్హత పొందిన విద్యార్ధులు ఈ నెల 25 నుంచి జరిగే కౌన్సిలింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. మొదటి రౌండ్ కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ , ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈ నెల 25 నుంచి 29వ తేదీవరకూ జరగనుంది.రెండవ దశ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 15 నుంచి 19వ తేదీ వరకూ ఉంటుంది. ఇక మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ నవంబర్ 1, 2 తేదీల్లో జరుగుతుంది. ఈ ప్రక్రియ ఫలితాలు నవంబర్ 3న విడుదలవుతాయి.
రాష్ట్ర నీట్ పీజీ కోటా సీట్ల భర్తీకై కౌన్సిలింగ్‌ను సంబంధిత రాష్ట్ర వైద్య కౌన్సిలింగ్ కమిటీలు నిర్వహిస్తాయని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ప్రకటించింది. 50 శాతం ఆల్ ఇండియా కోటా, డీమ్డ్ , సెంట్రల్ యూనివర్శిటీలు, ఇతర విద్యాసంస్థల్లో సీట్ల భర్తీకు నీట్ పీజీ కౌన్సిలింగ్ ప్రక్రియను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నిర్వహిస్తుంది. డీమ్డ్ , సెంట్రల్ యూనివర్శిటీ సీట్లు, పీజీ డీఎన్బీ సీట్ల ప్రవేశం కోసం అదనపు రౌండ్ ఉంటుంది. మిగిలిన సీట్ల కోసం చివరిలో మరో రౌండ్ కౌన్సిలింగ్ ఉంటుంది.
Also read: AP Municipal Elections: ఏపీలో మరోసారి మినీ మున్సిపల్ సంగ్రామం, నవంబర్‌లో ఎన్నికలకు కసరత్తు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook