Covid-19: సెప్టెంబరు 30 వరకు రైళ్లు బంద్

భారత్‌లో కరోనా (Coronavirus) మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం 60వేలకుపైగానే కరో్నా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి నివారణ కోసం కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ (ndian railways) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.

Last Updated : Aug 10, 2020, 07:39 PM IST
Covid-19: సెప్టెంబరు 30 వరకు రైళ్లు బంద్

Indian railways: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ( Coronavirus ) మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం 60వేలకుపైగానే కరో్నా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి నివారణ కోసం కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ ( Indian railways ) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌, సబర్బన్‌, ప్యాసింజర్‌ రైలు సర్వీసుల రద్దును సెప్టెంబరు ౩౦వ తేదీ వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నడుస్తున్న 230 కోవిడ్ స్పెషల్ రైళ్లు (Covid-19 trains) మాత్రమే నడుస్తాయని ఈ సందర్భంగా రైల్వేశాఖ తెలిపింది. Also read: Coronavirus: కరోనాపై గెలిచిన మరో సీఎం

నిత్యం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణ సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వేశాఖ ప్రజలకు సూచించింది. ఇంతకు ముందు రైల్వేశాఖ ఆగస్టు 12 వరకు రైళ్ల రద్దును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు దేశంలో కరోనా కేసులుయ 22లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశంలో 6లక్షల 34వేలకు పైగా కరోనా యాక్టివ్‌ కేసులుండగా, ఇప్పటివరకు 15లక్షల 34వేల మందికి పైగా బాధితులు ఈ మహమ్మారి నుంచి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు ఈ వైరస్‌ వల్ల దాదాపు 44వేలకు పైగా బాధితులు మరణించారు. Also read: Gujarat: మాస్క్ ధరించకపోతే రూ.1000 ఫైన్

Trending News