Sharad Pawar: మహారాష్ట్ర పొలిటికల్ కథా చిత్రమ్ ముగిసింది. అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో సీఎం ఏక్‌నాథ్ షిండే నెగ్గారు. విశ్వాస పరీక్షల్లో అత్యధిక ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. దీంతో ఏక్‌నాథ్ షిండే గెలుపు లాంఛనమయ్యింది. ఈక్రమంలో కొత్తగా ఏర్పడిన కూటమిపై ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఆరు నెలల్లో కొత్త ప్రభుత్వం కూలిపోతుందన్నారు. మధ్యంతర ఎన్నికలు తధ్యమని జోస్యం చెప్పారు.
తాజాగా రాజకీయ పరిణామాలపై ఎన్‌సీపీ నేతలతో ఆయన మంతనాలు జరిపారు. ఈసందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని ఎన్నికలకు సిద్దంగా ఉండాలని నేతలకు శరద్ పవార్ సూచించారు. ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వంపై కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని గుర్తు చేశారు. కేబినెట్ కూర్పు తర్వాత అసంతృప్తి జ్వాలలు మరింత పెరిగే అవకాశం ఉందని..అది ప్రభుత్వం కూలే పరిస్థితిని తీసుకోస్తుందన్నారు శరద్ పవార్.
ఆ ఎమ్మెల్యేలంతా ఉద్దవ్ ఠాక్రే వైపు వస్తారని..అందుకే రాబోయే ఆరు నెలలపాటు అప్రమత్తంగా ఉండాలని..ప్రజల్లోకి ఉండాలన్నారు. తాజాగా జరిగిన బలపరీక్షలో ఏక్‌నాథ్ షిండే వర్గం బలాన్ని నిరూపించుకుంది. ఆయనకు మద్దతుగా 164 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. వ్యతిరేకంగా 99 మంది ఓటు వేశారు. మరో ముగ్గురు ఓటింగ్‌లో పాల్గొనలేదు.
Also read:ఇంగ్లండ్ గడ్డపై జస్ప్రీత్ బుమ్రా మరో రికార్డు.. ఈసారి భువనేశ్వర్ రికార్డు బ్రేక్!
Also read:PM Modi: యావత్ దేశానికి అల్లూరి సీతారామరాజు ఆదర్శం..కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook