Political Science: వేర్పాటువాదం చాప్టర్‌‌ను తొలగించిన NCERT

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ( NCERT ) 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలోని ఒక చాప్టర్‌ను సవరించింది.  ఆ పాఠ్యాంశంలో ఉన్న ‘జమ్మూ కాశ్మీర్‌లో వేర్పాటువాద రాజకీయాలు’ అనే చాప్టర్‌ను తొలగించింది. 

Last Updated : Jul 22, 2020, 08:09 AM IST
Political Science: వేర్పాటువాదం చాప్టర్‌‌ను తొలగించిన NCERT

separatist politics: న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ( NCERT ) 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలోని ఒక చాప్టర్‌ను సవరించింది.  ఆ పాఠ్యాంశంలో ఉన్న ‘జమ్మూ కాశ్మీర్‌లో వేర్పాటువాద రాజకీయాలు’ అనే చాప్టర్‌ను తొలగించింది. ఈ మేరకు 2020-21 విద్యాసంవత్సరం టెక్స్ట్ బుక్ లో గతేడాది ఆర్టికల్ 370 (Article 370), రాష్ట్ర ప్రత్యేక హోదాను రద్దు చేయడం గురించి క్లుప్తంగా వివరించింది. Also read: Covid-19: అమర్‌నాథ్ యాత్ర రద్దు

అయితే.. గతేఏడాది ఆగస్టు 5 న కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రత్యేక హోదాను రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లుగా రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేసింది. ఈ క్రమంలో పొలిటికల్ సైన్స్ పుస్తకంలో ఉన్న "స్వాతంత్ర్యం తరువాత భారతదేశ రాజకీయాలు" అనే పాఠ్యాంశాన్ని సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కావున దానిలో ఉన్న వేర్పాటువాద రాజకీయాలు అనే చాప్టర్‌కు బదులుగా.. ఆర్టికల్ 370 ను రద్దు చేసే అంశంతోపాటు ప్రాంతీయ ఆకాంక్షలు, ఉగ్రవాదం, తదితర అంశాలను జోడించింది. 

ఈ మేరకు 2002 నుంచి జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన పరిణామాల గురించి ఈ చాప్టర్‌లో ప్రస్తావించింది.  భారత రాజ్యాంగం ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌కు ఆర్టికల్ 370 ప్రకారం ప్రత్యేక హోదా ఉందని పేర్కొంది. అయినప్పటికీ.. ఈ ప్రాంతంలో జరిగిన హింస, సరిహద్దు ఉగ్రవాదం, రాజకీయ అస్థిరత గురించి ప్రధానంగా వివరించింది. వీటి ఫలితంగా అమాయక పౌరులు, సైనికులు అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, పెద్ద సంఖ్యలో కాశ్మీరీ పండితులు నిరాశ్రయులయ్యారని ఈ చాప్టర్‌లో వివరించింది. Also read: IPL 2020: యూఏఈలోనే ఐపీఎల్ 2020.. 3 వేదికలు

Trending News