Sushant Death Case: ఎన్‌సీబీ అధికారికి కరోనా.. ఆగిన విచారణ

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ వ్యవహరంలో ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె తమ్ముడు పలువురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది.

Last Updated : Sep 16, 2020, 03:23 PM IST
Sushant Death Case: ఎన్‌సీబీ అధికారికి కరోనా.. ఆగిన విచారణ

Sushant Singh Rajput Death Case: న్యూఢిల్లీ: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ వ్యవహరంలో ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె తమ్ముడు పలువురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో బుధవారం సుశాంత్ మాజీ మేనేజర్ శ్రుతి మోడీని విచారించాల్సింది. అయితే.. ఎన్‌సీబీ దర్యాప్తు బృందంలోని ఒక కీలక అధికారికి కరోనావైరస్ (Coronavirus) పాజిటివ్‌గా తెలడంతో శ్రుతి మోడీ విచారణను అధికారులు అర్దాంతరంగా నిలిపివేశారు. కరోనా మార్గదర్శకాల ప్రకారం.. ఇతర సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించనున్నామని.. ఆ తర్వాత పూర్తి స్థాయిలో మళ్లీ దర్యాప్తు ప్రారంభమవుతుందని ఎన్‌సీబీ అధికారులు వెల్లడించారు. Also read: Bollywood Drugs Gang: సారా అలీ ఖాన్ నుంచి రియా చక్రవర్తి డ్రగ్స్ తీసుకునేది

అయితే.. సుశాంత్ ఆత్మహత్య, డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి వాట్సాప్ సంభాషణల్లో శ్రుతి మోడీతోపాటు, టాలెంట్ మేనేజర్ జయ సాహా పేర్లు బహిర్గతమైంది. ఆ తరువాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. బుధవారం ముంబైలోని ఎన్‌సీబీ గెస్ట్‌హౌస్‌కు విచారణకు హాజరుకావాలని వారిని ఆదేశించింది. అయితే.. జూన్14న సుశాంత్ మృతి తరువాత బాలీవుడ్‌తోపాటు.. రాజకీయ పార్టీల్లో దూమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఈడీతోపాటు ఏసీబీ, ఎన్‌సీబీ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో అనేక పరిణామాల తరువాత డ్రగ్స్ కేసు తాజాగా వెలుగులోకి రావడంతో.. రియా చక్రవర్తి,  ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి పలువురిని ఎన్‌సీబీ అరెస్టు చేసింది. Also read: Drugs case: డ్రగ్స్ కేసులో.. హీరోయిన్లు సారా, రకుల్?

Trending News