'కరోనా వైరస్' మృత్యు ఘంటికలు మోగిస్తున్న వేళ.. ఆ మహమ్మారిని నిత్యం ఎదుర్కొంటున్న వైద్యులు, వైద్య సిబ్బందికి భారత త్రివిధ దళాలు గౌరవ వందనం చేశాయి. ప్రభుత్వ ఆసుపత్రులపై పూల వర్షం కురిపించాయి.
ఈ కార్యక్రమంలో భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్లు, భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు, నావికదళానికి చెందిన హెలికాప్టర్లు పాల్గొన్నాయి. హరియాణాలోని పంచకుల ప్రభుత్వాసుపత్రిలో భారత ఆర్మీ జవాన్ల బ్యాండ్ ప్రదర్శన ఏర్పాటు చేసింది. కొద్దిసేపటి తర్వాత ఆ ఆస్పత్రిపై నుంచి పూల వర్షం కురిసింది. కరోనా మహమ్మారితో నిత్యం యుద్ధం చేస్తున్న వైద్యులారా అందుకోండి మా గౌరవ వందనాలు అంటూ పూలవర్షం కురిపించారు.
#WATCH IAF chopper holds flypast over Government Hospital, Panchkula; Indian Army band performs outside the hospital to express gratitude towards medical professionals fighting #COVID19.#Panchkula pic.twitter.com/PKut0f3czf
— ANI (@ANI) May 3, 2020
అలాగే గోవాలోని పనాజీలో మెడికల్ కాలేజీపైనా భారత నావికా దళానికి చెందిన హెలికాప్టర్ పూల వర్షం కురిపించింది. నావికాదళానికి చెందిన సిబ్బంది.. వైద్యులకు గౌరవ వందనం చేశారు.
#WATCH: Navy chopper showers flower petals on Goa Medical College in Panaji to express gratitude towards medical professionals fighting #COVID19. pic.twitter.com/fhIz1pQlpM
— ANI (@ANI) May 3, 2020