National Voters Day 2023: నేడే జాతీయ ఓటర్ల దినోత్సవం ఎందుకు ? చరిత్ర, ప్రాధాన్యత ఏంటి ?

National Voters Day 2023 Date: జాతీయ ఓటరు దినోత్సవం లక్ష్యాల్లో అతి ముఖ్యమైనది.. ఓటు హక్కుపై ఓటర్లలో అవగాహన పెంచి వారిని తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడమే. అందులోనూ కొత్తగా ఓటు హక్కు సాధించుకున్న వారికి వారి ఓటు విలువ తెలిసేలా అవగాహన కల్పించడం అనేది అతి ముఖ్యమైనది.

Written by - Pavan | Last Updated : Jan 25, 2023, 07:54 PM IST
National Voters Day 2023: నేడే జాతీయ ఓటర్ల దినోత్సవం ఎందుకు ? చరిత్ర, ప్రాధాన్యత ఏంటి ?

National Voters Day 2023 Date: ప్రతీ ఏడాది జనవరి 25వ తేదీన ఇండియాలో జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటుంటాం. ఓటు వేయడానికి అర్హత కలిగిన ప్రతీ ఒక్కరినీ తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రోత్సహించి ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంపొందించడమే జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రధాన లక్ష్యం. ఈ ఏడాది మనం నిర్వహించుకోబోయేది 12వ వార్షిక జాతీయ ఓటర్ల దినోత్సవం. 

జాతీయ ఓటర్ల దినోత్సవం చరిత్ర :
జాతీయ ఓటర్ల దినోత్సవం చరిత్రకు భారత ఎన్నికల సంఘం చరిత్రకు ఒకరకంగా అవినాభావ సంబంధం ఉంది. భారత ఎన్నికల సంఘాన్ని 1950 లో జనవరి 25న స్థాపించగా.. 2011 లో భారత ఎన్నికల సంఘం 61వ ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని అప్పటి భారత రాష్ట్రపతిగా ఉన్న ప్రతిభా పాటిల్ "ఓటర్ల దినోత్సవం" ప్రారంభించారు. ఇంకా చెప్పాలంటే భారత ఎన్నికల సంఘం స్థాపించిన జనవరి 25 రోజునే మనం జాతీయ ఓటర్ల దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నామన్న మాట.   

జాతీయ ఓటరు దినోత్సవం ఎందుకు ముఖ్యమైనదంటే..
జాతీయ ఓటరు దినోత్సవం లక్ష్యాల్లో అతి ముఖ్యమైనది.. ఓటు హక్కుపై ఓటర్లలో అవగాహన పెంచి వారిని తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడమే. అందులోనూ కొత్తగా ఓటు హక్కు సాధించుకున్న వారికి వారి ఓటు విలువ తెలిసేలా అవగాహన కల్పించడం అనేది అతి ముఖ్యమైనది. దేశంలో ఏదైనా పార్టీ కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా.. రాష్ట్రంలో ఏదైనా పార్టీ అధికారంలోకి రావాలనుకున్నా.. వారు మెజారిటీ ఓట్లు సొంతం చేసుకోవడం అనేది వారి విజయానికి ఎంతో అవసరం. అలాంటి ఓటు విలువను ఓటర్లు తెలుసుకునేలా చేయడమే జాతీయ ఓటరు దినోత్సవం లక్ష్యం. 

తమకు నచ్చిన నాయకుడిని, తాము మెచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశాన్ని ఇచ్చే ఓటును వినియోగించుకోకపోతే ఓటర్లు ఎంత నష్టపోతారో అర్థమయ్యేలా చెప్పడం ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వాలు అధికారికంగా ఆ కార్యక్రమం చేపట్టడానికి ఎంపిక చేసుకున్న రోజే ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ద్వారా ప్రజలు తమ ప్రజాప్రతినిధిని, తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఉపయోగపడే అస్త్రమే ఓటు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలే కాకుండా ప్రతీ ఏడాది జనవరి 25న వచ్చే నేషనల్ ఓటర్స్ ఓ కూడా ఆ ఓటు హక్కుని గుర్తుచేస్తుంది. ఓటు హక్కు విలువపై అవగాహన కొరవడిన ఓటర్లలో చైతన్యం రగిల్చి వారిని మొద్దు నిద్రలోంచి తట్టి లేపుతుంది... చైతన్యం వైపు నడిపిస్తుంది.

ఇది కూడా చదవండి : Reasons For Rejecting Loans: శాలరీ భారీగా ఉన్నప్పటికీ.. బ్యాంకు లోన్ ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసా

ఇది కూడా చదవండి : Big Discount On iPhone: ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్.. రూ. 25 వేల భారీ తగ్గింపు

ఇది కూడా చదవండి : Mahindra XUV400 EV: మహింద్రా నుంచి మరో కొత్త బాహుబలి.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 456 కిమీ రేంజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News