National Herald Case Latest News: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ విచారణలో భాగంగా యంగ్ ఇండియన్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కి చెందిన రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. స్థిరాస్తుల రూపంలో క్రైమ్‌లో వసూళ్లను ఎజెఎల్ కలిగి ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, లక్నోలోని ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ నేషనల్ హెరాల్డ్ కేసు తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇచ్చిన ఈడీ.. తాజాగా ఆస్తులను అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇందులో అసోసియేటెడ్ జర్నల్స్ ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ తెలిపింది. పీఎంఎల్‌ఏ (Prevention of Money Laundering Act) 2002 చట్టం కింద దర్యాప్తు చేసిన మనీలాండరింగ్ కేసులో రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసినట్ల ఉత్తర్వు జారీ చేసింది. M/s.అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్. (AJL) నేరాల ద్వారా వచ్చిన ఆదాయం పొందినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఆ ఉత్తర్వులో పేర్కొంది. ఢిల్లీ, ముంబై, లక్నో వంటి అనేక నగరాల్లో రూ.661.69 కోట్లు, M/s.యంగ్ ఇండియన్ (YI) రూ.90.21 వరకు, AJL ఈక్విటీ షేర్లలో పెట్టుబడి రూపంలో కోటి రూపాయలను జప్తు చేసినట్లు తెలిపింది.
ఈడీ నిర్ణయంపై కాంగ్రెస్ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్‌లో ఈడీ పనిచేస్తోందని ఆరోపణలు గుప్పించారు. ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను ఈడీ గతంలో ప్రశ్నించి వాంగ్మూలాలను నమోదు చేసింది. జూన్ 26, 2014న ఒక ప్రైవేట్ ఫిర్యాదుతో కూడిన ఆర్డర్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ జారీ చేసిన ఆదేశాల మేరకు ఈడీ మనీ-లాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది. గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న ఈడీ.. తాజాగా ఆస్తులను జప్తు చేయడం సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook