Narendra Modi: గురుతేజ్ బహదూర్‌కు ప్రధాని మోదీ నివాళి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని గురుద్వారా రాకబ్‌జంగ్‌ సాహిబ్‌ ( Gurudwara Shri Rakab Ganj Sahib) ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం ఉదయం గురుద్వారా రాకాబ్‌గంజ్‌కు చేరుకోని గురుతేజ్ బహదూర్‌కు నివాళులు అర్పించారు.

Last Updated : Dec 20, 2020, 12:01 PM IST
Narendra Modi: గురుతేజ్ బహదూర్‌కు ప్రధాని మోదీ నివాళి

PM Narendra Modi visits Gurudwara Rakabjung: న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని గురుద్వారా రాకబ్‌జంగ్‌ సాహిబ్‌ ( Gurudwara Shri Rakab Ganj Sahib) ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం ఉదయం గురుద్వారా రాకాబ్‌గంజ్‌కు చేరుకోని గురుతేజ్ బహదూర్‌కు నివాళులు అర్పించారు. అంతేకాకుండా అర్థాస్ కార్యక్రమంలో కూడా ప్రధాని మోదీ పాల్గొని గురుతేజ్ బహదూర్ (Guru Teg Bahadur) ఆశీస్సులు పొందారు.

అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గురుద్వారా సందర్శన కార్యక్రమాన్ని ఉన్నట్టుండి నిర్ణయించుకున్నారు. ప్రధాని గురుద్వారా చేరుకునే సమయంలో ఆయనకు ప్రత్యేక పోలీసు బందోబస్తు లేదు. అలాగే ఈ మార్గంలో ఎటువంటి ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేయలేదు. ఈ రోజు ఉదయాన్నే చలిలో ఒక సామాన్య వ్యక్తిలా ప్రధాని మోదీ గురుద్వారా చేరుకొని గురు తేజ్ బహదూర్‌కి నివాళులర్పించారు. Also read: Farmer protests: 25వ రోజుకు ఆందోళనలు.. నేడు అమర రైతులకు నివాళి

ఢిల్లీ (Delhi) లోని గురుద్వారా సందర్శన తరువాత ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ఫొటోలను షేర్ చేసి ఈ విధంగా రాశారు. ఈ రోజు చారిత్రాత్మక గురుద్వారా రకాబగంజ్ సాహిబ్‌కు వెళ్లి ప్రార్థనలు చేశానని. అక్కడ గురుతేజ్ బహదుర్ పవిత్ర శరీరానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారని తెలిపారు. ఈ రోజు ఆయన ఆశీస్సులు తీసుకున్నానని తెలిపారు. ప్రపంచంలోని లక్షలాది మంది మాదిరిగానే.. తాను కూడా  గురుతేజ్ బహదూర్ ప్రేరణ పొందానని మోదీ ట్విట్ చేశారు. Also read: Farmer protests: రైతులందరూ ఆ లేఖను చదవాలి: ప్రధాని మోదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News