Lakhimpur Kheri violence: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర మంత్రి కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం చెలరేగిన హింసలో మరో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ కుమారుడు ఆశిష్ మిశ్రా(Aashish Mishra)పై హత్య కేసు(Murder Case) నమోదైంది.
ఫిర్యాదులో ఏముందంటే..
రైతుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్(FIR)లో కేంద్రమంత్రి, అతని కుమారుడితోపాటు పలువురు వ్యక్తుల పేర్లు కూడా నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆశిష్ మిశ్రాను నడుపుతున్న కారు నిరసనకారుల గుంపుపైకి దూసుకెళ్లినట్లు రైతు సంఘాలు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నాయి. కేంద్రమంత్రి ఏకే మిశ్రా(Ajay Mishra)ను పదవి నుంచి భర్తరఫ్ చేయాలని.. కేంద్రమంత్రి, అతని కుమారుడిపై కేసునమోదు చేయాలని, న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. రైతులు తనకు మెమోరాండం ఇచ్చినట్లు లఖింపూర్ ఖేరి కలెక్టర్ ఏకే చౌరసియా తెలిపారు.
Also Read: యూపీలో దారుణం: రైతుల మీదకు దూసుకెళ్లిన కేంద్రమంత్రి కాన్వాయ్..8 మంది మృతి!
ఈ సంఘటనలో పాల్గొన్న వారందరిపై హత్య కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. కాగా.. దీనిపై టికోనియా పోలీసులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై హత్యా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారని అధికారులు తెలిపారు.
అక్కడ 144 సెక్షన్ విధింపు..
లఖింపూర్ ఖేరీ ఘటన(Lakhimpur Kheri violence) అనంతరం యూపీ(UP)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఘటనా స్థలికి వెళుతున్నట్లు ప్రతిపక్షాలు పేర్కొనడంతో లఖింపూర్ ఖేరీ(Lakhimpur Kheri) ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. దీంతోపాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించి భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఉదయం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని పోలీసులు అరెస్ట్ చేశారు. లక్నోలో సమాజ్ వాదీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను సైతం పోలీసుుల గృహనిర్భంధం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి