ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు (Sushant Singh Rajput) విచారణ విషయంలో ముంబై పోలీసులు, బిహార్ పోలీసుల (Mumbai Police Vs Bihar Police)కు మధ్య ఇంకా అవగాహన కుదరలేదు. కేసును తమకు అప్పగించాలని, లేకపోతే కేసు విచారణలో తమకు ముంబై పోలీసులు పూర్తిగా సహకరించాలని బిహార్ (పాట్నా) పోలీసులు కోరుతున్నా సరైన స్పందన రావడం లేదు. పాట్నా నుంచి ముంబైకి వచ్చిన ఐపీఎస్ అధికారిని హోం క్వారంటైన్ పేరుతో ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చేయడం బిహార్ పోలీసులకు నచ్చడం లేదు. Sushant: నొప్పి లేకుండా చనిపోవడం ఎలా..? గూగుల్‌లో వెతికిన సుశాంత్
ఈ నేపథ్యంలో శివసేన కీలకనేత సంజయ్ రౌత్ జీ న్యూస్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు పేరు, డబ్బు, హోదాను ఇచ్చింది ముంబై అని వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ముంబై పోలీసులు సెలబ్రిటీ కేసులాగ భావించి సుశాంత్ కేసును విచారణ కొనసాగిస్తుండగా.. ఇప్పుడు బిహార్ వాళ్లేందుకు దీనిపై ఆందోళన చెందుతున్నారో అర్థం కావడం లేదన్నారు. Sushant Case: రియా చక్రవర్తి పోలీసులకు సహకరిస్తోంది!
సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని బిహార్ ప్రభుత్వం కోరడం తెలిసిందే. అయితే ముంబై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నా.. కేసును సీబీఐకి అప్పజెప్పాంలంటూ కొందరు రాజకీయం చేస్తున్నారని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. సుశాంత్ ఆత్మహత్యలో శివసేన మంత్రి ఆదిథ్య ఠాక్రే హస్తం ఉందని సోషల్ మీడియాలో వదంతులు రావడంతో ఆయన స్పందించాల్సి వచ్చిందన్నారు. Photos: పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...
తనపై నిరాధారమైన ఆరోపణలు గుప్పిస్తున్నారని, ఇవి చెత్త రాజకీయాలంటూ ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు. ఏ ఆధారం లేకుండా ఎలా ఆరోపిస్తారు, మీతో ఏమైనా సమాచారం, ఆధారాలు ఉంటే ముంబై పోలీసులకు ఇచ్చి విచారణకు సహకరించాలని సూచించడం తెలిసిందే. సాహో డైరెక్టర్ Sujeeth Wedding Photos