Explosion in INS Ranvir: ఐఎన్ఎస్ రణవీర్‌లో పేలుడు.. ముగ్గురు నేవీ సిబ్బంది మృతి

Explosion in INS Ranvir: ఇంటర్నల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రమాదంపై సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారని.. పరిస్థితిని త్వరగానే అదుపులోకి తీసుకొచ్చారని అధికారులు వెల్లడించారు. నౌకలో ఎలాంటి మెటీరియల్ డ్యామేజ్ జరగలేదని తెలిపారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2022, 07:02 AM IST
  • యుద్ధనౌక ఐఎన్ఎస్ రణవీర్‌లో పేలుడు
  • ఇంటర్నల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రమాదం
  • ప్రమాదంలో ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
Explosion in INS Ranvir: ఐఎన్ఎస్ రణవీర్‌లో పేలుడు.. ముగ్గురు నేవీ సిబ్బంది మృతి

Explosion in INS Ranvir: ముంబైలోని నావల్ డాక్ యార్డ్‌లో మంగళవారం (జనవరి 18) సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డాక్ యార్డ్‌లో నిలిచి ఉన్న యుద్ధనౌక ఐఎన్ఎస్ రణవీర్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. నౌకలోని మానవరహిత ఎయిర్ కండిషనింగ్ కంపార్ట్‌మెంట్‌లో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. గాయపడ్డ నేవీ సిబ్బందిని స్థానిక నేవీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదాన్ని ఇండియన్ నేవీ అధికారికంగా ధ్రువీకరించింది.

ఇంటర్నల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రమాదంపై సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారని.. పరిస్థితిని త్వరగానే అదుపులోకి తీసుకొచ్చారని అధికారులు వెల్లడించారు. నౌకలో ఎలాంటి మెటీరియల్ డ్యామేజ్ జరగలేదని తెలిపారు. సాయంత్రం 4.30గం. సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ పేలుడు ఘటనపై ఇండియన్ నేవీ విచారణకు ఆదేశించింది. ప్రమాదంలో మృతి చెందిన సిబ్బంది వివరాలు ఇంకా తెలియరాలేదు.

ఐఎన్ఎస్ రణవీర్ ఏప్రిల్ 21, 1986న ఇండియన్ నేవీలోకి (Indian Navy) ప్రవేశించింది. ప్రస్తుతం తూర్పు నౌకాదళంలో క్రాస్ కోస్ట్ ఆపరేషన్స్‌లో ఈ నౌక సేవలందిస్తోంది. అప్పట్లో సోవియట్ యూనియన్‌లో ఈ నౌకను నిర్మించారు. రణవీర్ క్లాస్ డిస్ట్రాయర్‌లలో ఇదే మొదటిది. ఇందులో మొత్తం 325 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ యుద్ధనౌక గంటకు 35 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకెళ్లగలదు. సముద్ర జలాలపై గస్తీ, తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, క్రూయిజ్ క్షిపణలను ఇది టార్గెట్ చేయగలదు. 

Also Read: Horoscope Today January 19 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి మొండితనం పనికి రాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News