Mukesh Ambani’s security: ముఖేష్ అంబానికి Z ప్లస్ కేటగిరి భద్రత

Mukesh Ambani Gets Z plus Security: ప్రపంచ కుభేరుల్లో ముందు వరుసలో ఉండే ముఖేష్ అంబానికి భద్రతను పెంచుతూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ముఖేష్ అంబానికి జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తుండగా.. తాజాగా ఆ భద్రతను జడ్ ప్లస్ కేటగిరికి పెంచినట్టు సమాచారం. 

Written by - Pavan | Last Updated : Sep 30, 2022, 05:12 AM IST
  • ముఖేష్ అంబానికి ముప్పు పొంచి ఉందని ఇంటెలీజెన్స్ బ్యూరో హెచ్చరికలు
  • జడ్ ప్లస్ కేటగిరి సెక్యురిటీ కవర్ అంటే...
  • అంబాని భద్రతకు సవాల్ విసురుతూ కలకలం సృష్టించిన పలు ఘటనలు
Mukesh Ambani’s security: ముఖేష్ అంబానికి Z ప్లస్ కేటగిరి భద్రత

Mukesh Ambani Gets Z plus Security: ప్రపంచ కుభేరుల్లో ముందు వరుసలో ఉండే ముఖేష్ అంబానికి భద్రతను పెంచుతూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ముఖేష్ అంబానికి జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తుండగా.. తాజాగా ఆ భద్రతను జడ్ ప్లస్ కేటగిరికి పెంచినట్టు సమాచారం. వరల్డ్స్ రిచెస్ట్ బిజినెస్‌మేన్ ముఖేష్ అంబానికి ముప్పు పొంచి ఉందని ఇంటెలీజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుంటూ కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోంది.

ముఖేష్ అంబాని భద్రత కోసం ఏర్పాటు చేసిన జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఏర్పాట్లకు అయ్యే సిబ్బంది ఖర్చులను ఆయనే భరిస్తారని బిజినెస్ టుడే వార్తా కథనం పేర్కొంది. ఇటీవల ముంబైలో ముఖేష్ అంబాని నివాసానికి సమీపంలోనే ఆయన భద్రతకు సవాల్ విసురుతూ జరిగిన ఓ ఘటన ముఖేష్ అంబానికి భద్రతపై సందేహాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. 

జడ్ ప్లస్ కేటగిరి సెక్యురిటీ కవర్ అంటే...
జడ్ ప్లస్ కేటగిరి సెక్యురిటీ కవర్ అంటే దేశంలోనే ఎవరైనా ఒక ప్రముఖ వ్యక్తికి అందించే రెండవ అత్యున్నత భద్రతా వలయం. ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తికి అందించే భద్రతా ప్రమాణాల్లో ఇది రెండో స్థానంలో ఉంటుందన్న మాట. జడ్ ప్లస్ కేటగిరి సెక్యురిటీ కవర్ ఉన్న వారి కుటుంబసభ్యులకు సైతం రక్షణ కల్పిస్తారు. మొత్తం 55 మంది భద్రతా సిబ్బంది నిత్యం వీరిని డేగ కళ్లతో కాచుకుని ఉంటారు. ఈ 55 మంది సిబ్బందిలో 10 మందికిపైగా నేషనల్ సెక్యురిటీ గార్డ్స్ కమాండోలు (ఎన్ఎస్‌జీ కమాండోలు), పోలీసు ఉన్నతాధికారులు ఉంటారు. 

అంటిలియా వద్ద కలకలం సృష్టించిన కారు బాంబు.. అంబానీ దంపతులకు వార్నింగ్ లెటర్..
గతేడాది ఫిబ్రవరి 25న, ముంబైలో ముఖేష్ అంబాని కుటుంబం నివాసం ఉంటున్న అంటిలియా భవనానికి అతి సమీపంలోనే ఓ కారులో 20 జిలెటిన్ స్టిక్స్ నిల్వ చేసి ఉండటం కలకలం సృష్టించింది. ముఖేష్ అంబాని, నీతా అంబాని దంపతులను హెచ్చరిస్తూ ఆ కారులో ఓ లేఖ లభ్యమైంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఆ కారును థానెకు చెందిన మన్సుక్ హిరేన్ అనే కారు డెకర్ షాపు యజమానికి చెందిన కారుగా గుర్తించారు. ఆ తర్వాత మన్సుక్ హిరెన్ అనుమానాస్పదంగా శవమై కనిపించాడు. ఈ ఘటనలో ముంబై పోలీసు ఉన్నతాధికారి సచిన్ వేజ్‌కి ప్రమేయం ఉన్నట్టు తేలడంలో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పై స్థాయిలో బ్యూరోక్రాట్లకు సైతం ప్రమేయం ఉందని ఆరోపణలు రావడం.. అందులో కొంతమంది రాజీనామా చేయడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఇదిలావుండగా తాజాగా కేంద్రం ముఖేష్ అంబానికి జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Also Read : Mukesh Ambani: ముఖేష్ అంబానీకి బెదిరింపు కాల్స్‌.. ముంబైలో కలకలం 

Also Read : Mukesh Ambani: ముకేష్‌ అంబానీ జీతం ఎంతో తెలుసా ?

Also Read : Mukesh Ambani and Gautam Adani: ముకేశ్ అంబానీ గౌతమ్ అదానీ ఏం చదువుకున్నారో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News