పాకిస్థాన్ ఇష్యూ తర్వాత.. మోదీ, మన్మోహన్ కలిసారోచ్..!

ప్రధాని నరేంద్రమోదీ బుధవారం మన్మోహన్ సింగ్‌ను  కలుసుకున్నారు. మోదీ ఎన్నికలు ముగిసిన తరువాత ఆయన్ను కలవడం చర్చనీయాంశంగా మారింది.

Last Updated : Dec 13, 2017, 05:47 PM IST
పాకిస్థాన్ ఇష్యూ తర్వాత.. మోదీ, మన్మోహన్ కలిసారోచ్..!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మన్మోహన్ సింగ్ ను కలుసుకున్నారు. మోదీ ఎన్నికలు ముగిసిన తరువాత ఆయన్ను కలవడం చర్చనీయాంశంగా మారింది. 

2001 పార్లమెంటు దాడులకు నివాళులర్పించేందుకు ఢిల్లీలో నాయకులు సమావేశమైనప్పుడు మోదీ మరియు మన్మోహన్ మధ్య చిన్న కరచాలనం జరిగింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ కాంగ్రెస్ పై, మాజీప్రధాని మన్మోహన్ సింగ్ పై ఆరోపణలు చేయడం.. తనపై చేసిన ఆరోపణలను మన్మోహన్ ఖండించి.. మోదీ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం తెలిసిందే ..! 

పార్లమెంట్ ఘటన జరిగి నేటితో 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారికి నివాళులు అర్పించేందుకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు పార్టీలకతీతంగా వచ్చారు. 

2001 డిసెంబరు 13న పార్లమెంట్ సంఘటనలో, లష్కర్-ఇ-తోయిబా మరియు జైష్-ఎ-మహ్మద్ (జెఎం) తీవ్రవాద గ్రూపులకు చెందిన ఐదుగురు తీవ్రవాదులు న్యూఢిల్లీలో పార్లమెంట్ ముందు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో దాదాపు 14 మంది, ఎక్కువగా భద్రతా దళాలు మరియు ఒక పౌరుడు చనిపోయారు. పార్లమెంటు వాయిదా పడిన 40 నిమిషాల తర్వాత ఈ సంఘటన జరిగింది. అఫ్జల్ గురు, షౌకత్ హుస్సేన్, సార్ గిలానీ మరియు నవజోత్ సాన్హు లను ఇన్వెస్టిగేషన్ టీం నిందితులుగా గుర్తించింది.

Trending News