ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మిజోరాం లో పర్యటిస్తున్నారు. అక్కడ జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ప్రధాని ఐజ్వాల్ లో 60 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు ను ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ- ' ఏ సమస్య వచ్చిన మీరు ఢిల్లీకి రావక్కర్లేదు.. మీ వద్దకే అధికారులు వస్తారు' అని అన్నారు.
అలాగే ప్రధాని మోదీ అక్కడివారికి ముందుగానే క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. వచ్చే ఏడాది మిజోరాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నవేళ ప్రధాని పర్యటన సంతరించుకుంది. మోదీ ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ.. మరోవైపు బీజేపీ రాష్ట్రనేతలతో సమావేశమవుతూ బిజీబిజీగా గడపనున్నారు. మేఘాలయాలో మోదీ నూతన బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
You don't have to send your grievances to Delhi (central govt), authorities from Delhi will come to you themselves, we have named this policy as Ministry of DONER (Ministry for Development of North Eastern Region): PM Modi in Aizawl, Mizoram pic.twitter.com/K0VOPzu9k7
— ANI (@ANI) December 16, 2017
హైడ్రో పవర్ ప్రాజెక్టును ప్రారంభించిన మోదీ