Shashi Tharoor: కరోనా కట్టడిలో మోదీ ప్రభుత్వం విఫలం

ఎన్డీఏ సర్కార్‌పై కాంగ్రెస్ విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. కరోనా (Coronavirus) కట్టడిలో భారత్ కన్నా.. పాకిస్తాన్, ఆప్ఘానిస్తాన్ నయం అంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) కూడా మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Last Updated : Oct 18, 2020, 02:18 PM IST
Shashi Tharoor: కరోనా కట్టడిలో మోదీ ప్రభుత్వం విఫలం

Modi government failed in COVID-19 management: Shashi Tharoor: న్యూఢిల్లీ: ఎన్డీఏ సర్కార్‌పై కాంగ్రెస్ విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. కరోనా (Coronavirus) కట్టడిలో భారత్ కన్నా.. పాకిస్తాన్, ఆప్ఘానిస్తాన్ నయం అంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) కూడా మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కోవిడ్ విషయంలో భారత్ కన్నా పాకిస్తాన్ మంచిగా చర్యలు తీసుకుందంటూ.. థరూర్ పేర్కొన్నారు. వర్చువల్ వేదికగా జరిగిన ‘లాహోర్ లిటరేచర్ ఫెస్ట్’ ( Lahore Lit Fest) కార్యక్రమంలో శనివారం శశి థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి విషయంలో ఫిబ్రవరిలోనే కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ హెచ్చరించిందని, ఆ హెచ్చరికలను మోదీ పెడచెవిన పెట్టారంటూ ఆయన ఆరోపించారు. కోవిడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదని, ఈ విషయాన్ని ప్రజలు కూడా గుర్తించారని ఆయన పేర్కొన్నారు. Also read: Navratri Day 2: ‘బాలా త్రిపురసుందరి’గా అమ్మవారి దర్శనం

కోవిడ్‌ను చాలా సీరియస్‌గా తీసుకోవాలని లేదంటే ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సైతం హెచ్చరించారని, అయినా కేంద్రం వినలేదని థరూర్ పేర్కొన్నారు. అయితే ఈ మహమ్మారి కారణంగా దేశంలో మూర్ఖత్వం, పక్షపాతం బయటపడిందని వాటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతోందని ఆయన పేర్కొన్నారు. అయితే కరోనా మహమ్మారి ప్రారంభంలో ముస్లిం వర్గంపై బహిరంగంగా మూర్ఖత్వం ప్రదర్శించడం, వివక్షను చూపడానికి కేంద్రం తబ్లీగీ జమాతే కార్యక్రమాన్ని ఉపయోగించుకుందని థరూర్ ఆరోపించారు. Also read: Heavy Rains: హైదరాబాద్‌లో మళ్లీ జల ప్రళయం..

ఇదిలాఉంటే.. గత 24గంటల్లో శనివారం ( అక్టోబరు 17న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 61,871 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 1,033 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 74,94,552 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,14,031 కి పెరిగింది. Also read: Health Tips: గుండెపోటు.. ‘గోల్డెన్ అవర్’ చాలా కీలకం.. ఎందుకో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News