MK Stalin: తాము అమలుచేస్తున్న ప్రభుత్వ పథకాల్లో లోటుపాట్లు ఉంటే ఎత్తి చూపాలని..అంతేకానీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తే కథనాలు రాయాలని తాము ఎప్పుడూ ఆదేశించలేదని తమిళనాడు సీఎం స్టాలిన్(CM MK Stalin)అన్నారు. తప్పులను సరి చేసుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక నేతృత్వంలో ఆదివారం చెన్నైలో జరిగిన కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన్ హాజరయ్యారు.
'అన్ని సామాజిక వర్గాల సంక్షేమం, అభివృద్ధి డీఎంకే మోడల్ అని, ఆ దిశగానే తమ పయనం సాగుతోందని వివరించారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకొచ్చామని, పారిశ్రామిక రంగానికి పునర్జీవం పోశామ ని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని పారిశ్రామిక ఎగుమతుల్లో తమిళనాడు మూడో స్థానంలో నిలిచినట్టు గుర్తు చేశారు. తమిళనాడు(Tamilnadu) పారిశ్రామిక పెట్టుబడులకు నెలవు అని, ఇక్కడ అన్ని రకాల వసతులు, అవకాశాలు మెండుగా ఉన్నాయని' స్టాలిన్ వివరించారు.
Also read: Tamilnadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు, మళ్లీ వస్తోన్న చిన్నమ్మ
రాష్ట్రం రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు స్టాలిన్. అలాగే, రూ. 2 లక్షల కోట్లు పబ్లిక్ రంగ సంస్థలు సైతం అప్పుల్లో ఉన్నట్టు వివరించారు. నిధుల సమీకరణకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, జీఎస్టీ రూపంలో రాష్ట్రాల హక్కుల్ని యూనియన్ ప్రభుత్వం కాల రాసి, ఆ నిధుల్ని తన్నుకెళ్తోందని ధ్వజమెత్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook