Conrad Sangma: మేఘాలయ ముఖ్యమంత్రికి కరోనా

దేశంలో కరోనా మహమ్మారి ( Coronavirus ) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు.

Last Updated : Dec 12, 2020, 08:39 AM IST
Conrad Sangma: మేఘాలయ ముఖ్యమంత్రికి కరోనా

Meghalaya CM Conrad Sangma Tests Covid-19 Positive: షిల్లాంగ్‌: దేశంలో కరోనా మహమ్మారి ( Coronavirus ) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సీఎం ( Meghalaya ) కరోనా బారిన పడ్డారు. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా (Meghalaya CM Conrad Sangma )కు కూడా కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. 

స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్ష చేయించుకున్నానని.. రిపోర్టు పాజిటివ్‌ (Covid-19 Positive) గా వచ్చిందని సీఎం సంగ్మా ( Conrad Sangma ) శుక్రవారం పేర్కొన్నారు. ఈ విషయాన్ని సంగ్మా ట్విట్టర్‌ ద్వారా శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతం తేలికపాటి కరోనా లక్షణాలున్నాయని, హోం ఐసొలేషన్‌లో ఉన్నానని పేర్కొన్నారు. గత ఐదు రోజుల నుంచి తనను కలిసినవారు తమ ఆరోగ్యంపట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే కరోనా పరీక్ష చేయించుకోవాలని సీఎం కాన్రాడ్ సంగ్మా సూచించారు. Also read: CM KCR: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ భేటీ

ఇదిలాఉంటే.. మేఘాలయ సీఎం సంగ్మా కంటే ముందుగా.. ఆయన క్యాబినెట్ మంత్రులు పలువురు సైతం కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వారంతా కోలుకున్నారు. Also read: Dress Code for Employees: మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News