వాహ్.. మణిపూర్.. వాహ్..!!

'కరోనా వైరస్'. . దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా విస్తరిస్తోంది. ఇప్పటికే భారత దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17 వేలు దాటిపోయింది. కానీ కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వేళ్ల మీద లెక్కించే విధంగా ఉంది. అవే ఈశాన్య రాష్ట్రాలు.

Last Updated : Apr 20, 2020, 11:17 AM IST
వాహ్.. మణిపూర్.. వాహ్..!!

'కరోనా వైరస్'. . దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా విస్తరిస్తోంది. ఇప్పటికే భారత దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17 వేలు దాటిపోయింది. కానీ కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వేళ్ల మీద లెక్కించే విధంగా ఉంది. అవే ఈశాన్య రాష్ట్రాలు. 

ఐతే ఇప్పుడు మణిపూర్ మొట్టమొదటిసారిగా 'కరోనా వైరస్' ఫ్రీ రాష్ట్రంగా అవతరించింది. ఈ రాష్ట్రంలో గతంలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు వారిద్దరూ కూడా కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిపోయి  ఇంటికి వెళ్లారు.  ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో ఎక్కడా లేవు. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. 

మణిపూర్ లో కరోనా  పాజిటివ్ కేసులు లేవంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు ఉన్న ఇద్దరు కరోనా పాజిటివ్ రోగులు  పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. మణిపూర్ ఇప్పుడు కరోనా ఫ్రీ స్టేట్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రజల సహకారం, వైద్య సిబ్బంది సహకారం, లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయడం ద్వారా ఇది సాధ్యమైందని తెలిపారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News