"బంగ్లార్ గోర్బో" ఇదే ఇప్పుడు ఆ పార్టీ ఎన్నికల నినాదం..

వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు మమతా బెనర్జీ చేసిన సరికొత్త శైలిలో దూసుకుపోతోంది. రానున్న ఎన్నికలకు పెద్ద ఎత్తున "బంగ్లర్ గోర్బో మమతా" పేరుతో ప్రజల్లోకి వెళుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి.  "దీదికే బోలో" (దీదీకి చెప్పండి) అనే  

Last Updated : Mar 2, 2020, 05:48 PM IST
"బంగ్లార్ గోర్బో" ఇదే ఇప్పుడు ఆ పార్టీ ఎన్నికల నినాదం..

కోల్ కతా: వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు మమతా బెనర్జీ చేసిన సరికొత్త శైలిలో దూసుకుపోతోంది. రానున్న ఎన్నికలకు పెద్ద ఎత్తున "బంగ్లర్ గోర్బో మమతా" పేరుతో ప్రజల్లోకి వెళుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి.  "దీదికే బోలో" (దీదీకి చెప్పండి) అనే  మరో వినూత్నంగా ఇంతకుముందు ప్రజల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే 

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు లక్ష మందికి పైగా తృణమూల్ కార్యకర్తలు రాష్ట్రమంతటా పర్యటించాలని యోచిస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయగల నాయకురాలు మమతా బెనర్జీయేనని, మత సామరస్యాన్ని కాపాడుకోగల ఏకైక ముఖ్యమంత్రి అని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలని నిర్ణయించారు.  

కాగా, 75 రోజుల పూర్తి స్థాయి ప్రణాళిక నేడు ప్రారంభమైందని, గత సంవత్సరం, "దీదీ కే బోలో" ప్రచారం హెల్ప్‌లైన్ నంబర్‌ను ఒక వెబ్‌సైట్‌ను రూపొందించామని తెలిపారు. గత ఏడాదిలో జరిగిన సాధారణ ఎన్నికల తరవాత ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరేవిధంగా సహకరించుట కొరకై పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అనే సంస్థతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒప్పందం కుదుర్చుకుంది. 

మరోవైపు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, సోషల్ మీడియాతో పాటు పలురకాల సాధనాల ద్వారా లక్షలాది మంది కార్మికులతో, వివిధ సమూహాలతో కలిసి సంభాషించాలని యోచిస్తున్నట్లు తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News