AICC President: ఆలిండియా కాంగ్రెస్ కమిటి అధ్యక్ష ఎన్నిక అనేక మలుపులు తిరుగుతోంది. ప్రెసిడెంట్ రేసులో పలువురు నేతల పేర్లు వినిపించగా.. చివరి రోజ బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఏఐసీసీ అధ్యక్ష రేసులో ఎంపీ శశిథరూర్, సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ నిలిచారు. వాళ్లిద్దరు చివరి రోజు నామినేషన్ వేస్తారనగా.. మరో కీలక పరిణామం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్ష రేసులోకి కొత్త నేత వచ్చారు. పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే రేసులోకి వచ్చారు. ఖర్గే రావడంతో మొత్తం సీన్ మారిపోయినట్లు కనిపిస్తోంది. ఖర్గే ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
గాంధీ కుటుంబం మద్దతు కూడా ఖర్గేకు ఉందంటున్నారు. గురువారం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తారని భావించిన దిగ్విజయ్ సింగ్.. సడెన గా మల్లిఖార్జున ఖర్గే ఇంటికి వెళ్లారు. దీంతో ఖర్గేకు మద్దతుగా దిగ్విజయ్ సింగ్ రేసు నుంచి తప్పుకున్నారు. మరో నేత శశి థరూర్ మాత్రం నామినేషన్ వేయనున్నారు. దీంతో ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలో పోటీ ఖర్గే-శశిథరూర్ మధ్యే ఉండనుంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై మరోసారి స్పందించారు శశిథరూర్. ‘‘మా అందరిదీ ఒకటే సిద్ధాంతం. పార్టీని బలపర్చాలని అనుకుంటున్నాం. మా మధ్య స్నేహపూర్వక పోటీ ఉంది. శత్రుత్వం లేదు. మల్లికార్జున ఖర్గే కూడా పోటీ చేయనున్నారంటూ ఊహాగానాలు మాత్రమే వస్తున్నాయి. ఆయన కూడా మా గౌరవప్రదమైన సహచర నేత. లోక్ సభలో మేము కలిసి పనిచేశాం. పోటీలో ఎక్కువ మంది ఉండడం మంచిదే’’ అని శశి థరూర్ కామెంట్ చేశారు.
Read also: AP TET Results 2022: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండి ఇలా...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.