Chenab Railway Bridge: ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జి పట్టాలెక్కిన మహింద్రా బొలెరో.. మంత్రి గారి కోసమే..

Mahindra Bolero on Chenab Railway Bridge: మహింద్రా బొలెరో వాహనం చీనాబ్ నదిపై నిర్మించిన ఈ రైలు వంతెనపైకి వెళ్తుండగా రికార్డు చేసిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. అవి క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. 1400 కోట్ల రూపాయలతో నిర్మాణం అవుతున్న ఈ రైల్వే బ్రిడ్జి మన దేశానికే గర్వ కారణం కానుంది.

Written by - Pavan | Last Updated : Mar 29, 2023, 06:35 AM IST
Chenab Railway Bridge: ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జి పట్టాలెక్కిన మహింద్రా బొలెరో.. మంత్రి గారి కోసమే..

Mahindra Bolero on Chenab Railway Bridge: ప్రపంచంలోనే అతి ఎత్తైన రైలు వంతెన మన దేశంలోనే నిర్మాణం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జి అతి త్వరలోనే జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో తాజాగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బ్రడ్జి నిర్మాణాన్ని సందర్శించి పనుల తీరును సమీక్షించారు. ఈ రైల్వే బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు. ఇది ఈఫిల్ టవర్ కంటే ఎక్కువ ఎత్తు. ఈ బ్రిడ్జిపైకి చేరుకోవడానికి రైల్వే శాఖ తొలిసారిగా ఒక మహింద్రా బొలెరో వాహనాన్ని మాడిఫై చేసి రైలు పట్టాలపై ప్రయాణించేందుకు అనుగుణంగా వాహనం టైర్లకు ముందు, వెనుక భాగంలో చక్రాలను అమర్చారు. దీంతో ఇంత ఎత్తైన ఈ రైల్వే బ్రిడ్జిపైకి వెళ్లిన తొలి వాహనంగా మహింద్రా బొలెరో రికార్డులకెక్కింది.

మహింద్రా బొలెరో వాహనం చీనాబ్ నదిపై నిర్మించిన ఈ రైలు వంతెనపైకి వెళ్తుండగా రికార్డు చేసిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. అవి క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. 1400 కోట్ల రూపాయలతో నిర్మాణం అవుతున్న ఈ రైల్వే బ్రిడ్జి మన దేశానికే గర్వ కారణం కానుంది.

రైల్వే బ్రిడ్జి భద్రతపై చేయాల్సిన అన్నీ పరీక్షలు, ప్రయోగాలు పూర్తయ్యాయి. స్టెబిలిటీ, హై-వెలాసిటీ విండ్స్ టెస్ట్, భూకంపం వస్తే తట్టుకోగలదా లేదా అలాగే చీనాబ్ నదిలో నీటి ప్రవాహం స్థాయి పెరిగితే ఎదురయ్యే హైడ్రాలాజికల్ ఇంపాక్ట్స్ వంటి అన్ని పరీక్షలు పూర్తయ్యాయి. 

 

2017 నవంబర్‌లో ఈ రైల్వే బ్రిడ్జికి పునాది పని పూర్తి కాగా 2021, ఏప్రిల్‌లో ఆర్చ్ కన్‌స్ట్రక్షన్ వర్క్ ప్రారంభమైంది. ఇంజనీర్స్ అంచనాల మేరకు చీనాబ్ రైల్వే బ్రిడ్జి ఒక్కసారి వినియోగంలోకి వస్తే.. ఆ తరువాత 120 ఏళ్లపాటు మన్నిక ఇస్తుంది. అలాగే గంటకు 260 కి.మీ వేగంతో వీచే ఈదురుగాలులను కూడా తట్టుకునే శక్తి, సామర్థ్యాలు ఈ రైల్వే బ్రిడ్ది సొంతం. ఇండియాను మరోసారి ప్రపంచ పటంలో నిలబెట్టనున్న ఈ రైల్వే బ్రిడ్జి.. 21వ శతాబ్ధం ఇంజనీర్ల ప్రతిభకు నిలువుటద్దం కానుంది.

ఇది కూడా చదవండి : JIO Super Recharge Plan: నెలకు రూ. 240 ఖర్చుతోనే 84 రోజుల వ్యాలిడిటీతో రోజూ 2GB డేటా

ఇది కూడా చదవండి : Best Mileage Petrol Car: రూ. 5.3 లక్షలకే అధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారు.. ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

ఇది కూడా చదవండి : Hyundai Creta Cars: 12 నుంచి 21 లక్షల విలువైన కారు రూ. 8 లక్షలకే.. వెంటనే కారు మీ చేతికి.. ఎగబడుతున్న జనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News