Omicron cases in Maharashtra: మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron) కల్లోలం సృష్టిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 7 ఒమిక్రాన్ కేసులు(Seven omicron cases) వెలుగుచూశాయి. ఇందులో మూడున్నరేళ్ల చిన్నారి కూడా ఉంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా..ముంబయి(Mumbai)లో శనివారం నుంచి రెండు రోజుల పాటు 144 సెక్షన్ విధించారు.
Also Read: Omicron scare: వ్యాక్సిన్ తీసుకోలేదా? అయితే రేషన్ షాప్స్ నుంచి మాల్స్ వరకు నో ఎంట్రీ..!
ర్యాలీలు, మోర్చాలు వంటి కార్యక్రమాలపై నిషేధం విధించారు. అధిక సంఖ్యలో ప్రజలు ఒకచోట గుమిగూడరాదని డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. దేశంలో మెుత్తం మీద 32 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూస్తే...ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా 17 కేసులు(Omicron cases in Maharashtra) ఉన్నాయి.
Also Read: Mumbai New Omicron case : ముంబైలోని ధారవిలో మరో ఒమిక్రాన్ కేసు
శుక్రవారం నమోదయిన ఏడు కేసుల్లో మూడు మంబయిలోనూ, పింప్రీ-చించ్వాడలో నాలుగు ఉన్నాయి. ఒమిక్రాన్ సోకిన వారిలో నలుగురికి లక్షణాలు లేవని, ముగ్గురిలో స్వల్ప లక్షణాలు కన్పించినట్లు అధికారులు తెలిపారు. డిసెంబరు 1 నుంచి ముంబయి, పుణె, నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టుల ద్వారా 61వేల మందికి పైగా అంతర్జాతీయ ప్రయాణికులు రాష్ట్రానికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో దాదాపు 10వేల మంది ప్రయాణికులు ఒమిక్రాన్(Omicron) వ్యాప్తి ఉన్న దేశాల నుంచి వచ్చినవారే అని తెలిపారు. వారందరినీ గుర్తించి..పరీక్షలు చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Maharashtra: 'మహా'లో 'ఒమిక్రాన్' కల్లోలం...ముంబయిలో 144 సెక్షన్ అమలు..
మహారాష్ట్రలో 'ఒమిక్రాన్' కలవరం
నిన్న 7 కేసులు నమోదు
ముంబయిలో రెండు రోజులపాటు 144 సెక్షన్ అమలు