Murder over Kichadi: కిచిడీలో ఉప్పు ఎక్కువైందని... భార్య గొంతు నులిమి చంపిన భర్త...

Man strangles wife after fight over Kichadi: భార్య వడ్డించిన కిచిడీలో ఉప్పు ఎక్కువైందని ఏకంగా ఆమెను హత్య చేశాడో భర్త. కొడుకు అడ్డుపడినా వినిపించుకోకుండా కసితీరా ఆమె గొంతు నులిమి హత్య చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 17, 2022, 09:53 AM IST
  • మహారాష్ట్ర థానే జిల్లాలో దారుణం
  • కిచిడీ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ
  • భార్య గొంతు నులిమి చంపేసిన భర్త
Murder over Kichadi: కిచిడీలో ఉప్పు ఎక్కువైందని... భార్య గొంతు నులిమి చంపిన భర్త...

Man strangles wife after fight over Kichadi: మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం జరిగింది. కిచిడీలో ఉప్పు ఎక్కువైందని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ భర్త ఏకంగా భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. మొదట చేతులతో ఆమె గొంతు నులిమిన అతను... ఆ తర్వాత నైలాన్ తాడుతో మరోసారి కసితీరా గొంతు నులిమి చంపాడు. నిందితుడి 12 ఏళ్ల కుమారుడు చిన్మయి ఈ విషయాలను పోలీసులకు వెల్లడించాడు.

పోలీసుల కథనం ప్రకారం... థానే జిల్లాకు చెందిన నీలేశ్ (46) ఓ బ్యాంకులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం (ఏప్రిల్ 15) ఉదయం ఆఫీసుకు రెడీ అయిన నీలేశ్‌కు అతని భార్య కిచిడీ తీసుకొచ్చి ఇచ్చింది. కిచిడీ అలా నోట్లో పెట్టాడో లేదో... వెంటనే భార్య వెనకాలే వెళ్లి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఇష్టమొచ్చినట్లుగా ఆమెను కొట్టాడు. కొడుకు చిన్మయి అడ్డుపడినా వినిపించుకోలేదు.

ఆపై భార్య గొంతును చేతులతో గట్టిగా నులిమి చంపేశాడు. అక్కడితో శాంతించక... నైలాన్ తాడుతో మరోసారి కసితీరా ఆమె గొంతు నులిమాడు. ఇంతలో నీలేశ్ కొడుకు చిన్మయి తన మేనమామకు సమాచారమిచ్చాడు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న అతను తన సోదరిని ఆసుపత్రికి తీసుకెళ్లగా... అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

చిన్మయిని వెంట పెట్టుకుని పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన అతని మేనమామ నీలేశ్‌పై ఫిర్యాదు చేశాడు. పోలీసులకు చిన్మయి జరిగిన ఘటన గురించి వివరించాడు. కిచిడీలో ఉప్పు ఎక్కువైనందుకు తన తండ్రి తల్లిని హత్య చేశాడని తెలిపాడు. దీంతో నీలేశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. ప్రతీ శుక్రవారం రోజు తాను ఉపవాసం ఉంటానని.. అల్పాహారం మాత్రమే తీసుకుంటానని చెప్పాడు. ఆరోజు కిచిడీలో ఉప్పు ఎక్కువవడంతో తన భార్యపై మండిపడ్డానని... అది గొడవకు దారితీసి చివరకు హత్య దాకా వెళ్లిందని చెప్పుకొచ్చాడు.

Also Read: Prabhas Fined: ఆ కారు ప్రభాస్‌ది కాదు... క్లారిటీ ఇచ్చిన రెబల్ స్టార్ పీఆర్ టీమ్...

Prashant Kishor: టార్గెట్ 2024... కాంగ్రెస్‌లోకి ప్రశాంత్ కిశోర్...? పార్టీకి పునర్వైభవం కోసం పీకే రోడ్ మ్యాప్..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News