Loksabha Election 2024 Results: 400 మార్క్ దాటుతామంటూ ప్రచారం హోరెత్తించిన బీజేపీ సారద్యంలోని ఎన్డీయేకు ఎదురుదెబ్బ తగిలింది. 400 కాదు కదా కనీసం 300 మార్క్ కూడా దాటలేకపోయింది. మేజిక్ ఫిగర్ కంటే కొద్దిగా ఆధిక్యం సాధించగలిగింది అంతే. ఎన్డీయేకు ఈ పరిస్థితి ఎదురవడానికి కారణం ఉత్తరాది రాష్ట్రాలే అంటే ఆశ్చర్యం లేదు.
దేశంలో మరోసారి అధికారం సాదించగలుగుతున్నా మెజార్టీ మాత్రం బొటాబొటీగా రావడం బీజేపీకు, ఎన్డీయే కూటమికి షాకింగ్‌గా మారింది. బీజేపీకు పూర్తి ఆధిక్యం లేకపోవడం ఎన్డీయే కూటమి పార్టీలకు లాభమే అయినా బీజేపీకు మాత్రం గట్టి దెబ్బే. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకు గట్టి ఎదురుదెబ్బ తగలడమే ఇందుకు కారణం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ స్వయంగా 75 స్థానాల్లో పోటీ చేయగా కేవలం 33 స్థానాల్లో విజయం సాధించింది. ఇక పశ్చిమ బెంగాల్లో 42 స్థానాల్లో పోటీ చేసి 20 దాటుతాయని ఆశించింది. కానీ 12 సీట్లకే పరిమితమైంది. ఇక రాజస్థాన్‌లో 25 స్థానాల్లో పోటీ చేసి 14 స్థానాలు, మహారాష్ట్రలో 28 స్థానాల్లో పోటీ చేసి 9 స్థానాలు దక్కించుకోవడంతో అనుకున్న పాచిక పారలేదు. కర్ణాటకలో 19 స్థానాలు గెలిచినా గతం కంటే తగ్గాయి.
మొత్తం 48 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 9 స్థానాలకే పరిమితం కాగా ఇండియా కూటమిలోని ఉద్ధవ్ థాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీవైపే ప్రజలు నిలిచారు. ఏక్నాథ్ షిండే సారధ్యంలోని శివసేనకు, అజిత్ పవార్ సారద్యంలోని ఎన్సీపీను ప్రజలు ఆదరించలేదు. ఇండియా కూటమి మహారాష్ట్రలో ఏకంగా 30కు పైగా స్థానాలు గెల్చుకుంది. గత ఎన్నికల్లో ఇదే మహారాష్ట్ర నుంచి ఎన్డీయే కూటమి 41 స్థానాలు గెల్చుకుంది. ఈసారి కేవలం 9 స్థానాలే దక్కించుకుంది.
ఈ లోక్‌సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో జరిగిన పరిణామాల్ని ప్రజలు బహుశా అంగీకరించలేదన్పిస్తోంది. ఉద్ధవ్ థాకరే సారధ్యంలోని శివసేన ప్రభుత్వాన్ని పడగొట్టి పార్టీని చీల్చి కైవసం చేసుకోవడం ఓవైపు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని అజిత్ పవార్ చీల్చి కైవసం చేసుకోవడం మరోవైపు ప్రధాన పరిణామాలు. మొత్తానికి లోక్‌సభ 2024 ఎన్నికలు బీజేపీకు గట్టి షాక్ ఇచ్చాయి. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ గట్టిగా పుంజుకుంది.
Also read: AP Assembly Results 2024: ఏపీ ఎన్నికల్లో జనసేన క్లీన్‌స్వీప్, పవన్ సహా ఎవరి మెజార్టీ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook