Vice President: భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్‌..సంబరాల్లో బీజేపీ..!

Vice President: భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్‌ 

Written by - Alla Swamy | Last Updated : Aug 6, 2022, 08:59 PM IST
Vice President: భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్‌..సంబరాల్లో బీజేపీ..!
Live Blog

Vice President: భారత ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్‌ విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాపై 346 ఓట్ల తేడాతో విజయం ఢంకా మోగించారు. జగదీప్‌ ధన్‌ఖడ్‌కు 528 ఓట్లు, మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం 725 ఓట్లు పోలైయ్యాయి. ఇందులో 15 చెల్లని ఓట్లుగా ఉన్నాయి. ఈనెల 11న ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

6 August, 2022

  • 20:50 PM

    దేశవ్యాప్తంగా బీజేపీ సంబరాలు

     

  • 20:36 PM

    భారత ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన జగదీప్ ధన్‌ఖడ్‌కు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.

     

  • 20:33 PM

    భారత ఉపరాష్ట్రపతిగా గెలిచిన జగదీప్ ధన్‌ఖడ్‌ను ప్రధాని మోదీ కలిశారు. ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. 

     

  • 20:26 PM

    భారత ఉపరాష్ట్రపతిగా గెలిచిన జగదీప్ ధన్‌ఖడ్‌కు విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా శుభాకాంక్షలు తెలిపారు. 

  • 20:23 PM

    1951 మే 18న రాజస్థాన్‌లో జగదీప్‌ ధన్‌ఖడ్ జననం
    గోఖల్ చంద్, కేసరి దేవి తల్లిదండ్రులు
    యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌లో ఎల్‌ఎల్‌బీ పట్టా
    రాజస్థాన్‌ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా సేవలు
    1989 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపు
    1990లో కేంద్రమంత్రిగా బాధ్యతలు
    1993-98 మధ్య కిషన్‌ గఢ్‌ ఎమ్మెల్యేగా సేవలు
    2019 నుంచి బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు

     

  • 20:14 PM

    భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్‌
    మార్గరెట్ అల్వాపై 346 ఓట్ల తేడాతో విజయం
    జగదీప్‌ ధన్‌ఖడ్‌కు 528 ఓట్లు
    మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు
    మొత్తం 725 ఓట్లు పోల్
    15 చెల్లని ఓట్లు
    11న ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్‌ ప్రమాణస్వీకారం

  • 20:04 PM

    భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్‌

     

  • 18:30 PM

    భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ 
    ఢిల్లీలో బీజేపీ నేతల సంబరాలు మొదలు
    కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఇంటికి జగదీప్‌ ధన్‌ఖడ్
    సంబరాల్లో పాల్గొన్న ఎన్డీఏ అభ్యర్థి

  • 18:11 PM

    కొనసాగుతున్న భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్
    ఓటు వేసిన 725 మంది ఎంపీలు
    ఓటు వేయని బీజేపీ ఎంపీలు సన్నీ దియోల్, సంజయ్ ద్రోత్రే
    ఎన్నికలకు దూరంగా టీఎంసీ
    ఐనా ఓటు వేసిన ఇద్దరు టీఎంసీ ఎంపీలు

     

  • 15:17 PM

    ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ 

  • 12:28 PM

    ఉప రాష్ట్రపతి ఎన్నికలో తన ఓటు హక్కు వినియోగించుకున్న విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా 

  • 11:20 AM

    వీల్ చైర్ లో వచ్చి ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 

  • 11:19 AM

    ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 

  • 10:30 AM

    ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

  • 10:05 AM

    టీఎంసీ పోలింగ్ దూరంగా ఉండటంతో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో 744 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  ఈనెల 11న కొత్త ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

     

  • 09:35 AM

    ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి పూర్తి మెజార్టీ కనిపిస్తోంది. వివిధ పార్టీలు తీసుకున్న నిర్ణయం ప్రకారం అధికార ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధనకర్ కు 550 వరకు ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తుండగా.. విపక్షాల అభ్యర్థి మార్గరేట్ ఆల్వాకు 200 వరకు ఓట్లు వచ్చే అవకాశం ఉంది.

  • 07:55 AM

    ఉప రాష్ష్రపతి ఎన్నికల పోలింగ్ కు తృణామూల్ కాంగ్రెస్ దూరం. టీఎంసీకి లోక్ సభలో 23 మంది, రాజ్యసభలో 16 మంది సభ్యులు ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో ఉన్న జగదీప్ ధనకర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్నారు.

  • 07:18 AM

    లోక్ సభలో ప్రస్తుతం రెండు ఎంపీ స్ఠానాలు ఖాళీగా ఉండటంతో 788 మంది ఉప రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ లో పాల్గొననున్నారు.

     

Trending News