Housing Loan: సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. స్థోమతను బట్టి ఇంటి నిర్మాణం ఉంటుంది. ఎక్కువగా బ్యాంకుల్నించి రుణం తీసుకుని ఇళ్లు కట్టుకోవడం లేదా కొనుగోలు చేయడం చేస్తుంటారు. అసలు హోమ్ లోన్ కోసం ఏ డాక్యుమెంట్లు కావాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
సొంతంగా ఓ ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి ఆలోచన. సంపాదన, స్థోమతను బట్టి ఇంటి నిర్మాణం ఉంటుంది. కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని ఇళ్లు నిర్మించుకుంటారు. ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు కోసం ఎక్కువ మంది బ్యాంకు లోన్‌పై ఆధారపడుతుంటారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆకర్షణీయమైన వడ్డీతో లోన్లు అందిస్తోంది. కేవలం 6.70 శాతం వడ్డీరేటుతో గృహ రుణాలు ఇస్తోంది. ఎస్బీఐ(SBI)ఇటీవల చేసిన ప్రకటనలో ప్రభుత్వరంగ బ్యాంకు ఖాతాదారుల కోసం హోమ్ లోన్‌కు(Housing loan documents) అవసరమైన పత్రాల జాబితాను విడుదల చేసింది. ఆ డాక్యుమెంట్లు ఏంటనేది తెలుసుకోండి.
ఉద్యోగి గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఫిల్ చేసిన దరఖాస్తుపై మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు అతికించాలి. గుర్తింపు కోసం పాన్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ లేదా ఓటర్ ఐడీ కార్డు ఉండాలి. రెసిడెన్స్ ప్రూఫ్ కోసం విద్యుత్ బిల్లు లేదా టెలీఫోన్ బిల్లు లేదా వాటర్ బిల్లు లేదా ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇక ప్రాపర్టీకు సంబంధించి సేల్ డీడ్ ఉండాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అవసరమౌతుంది. మెయింటెనెన్స్ బిల్లు, విద్యుత్ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు, అప్రూవ్డ్ ప్లాన్ కాపీ, బిల్డర్ రిజిస్టర్ అగ్రిమెంట్, కన్వేయన్స్ డీడ్, బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి. దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఆరు నెలల బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ ఉండాలి. శాలరీ స్లిప్ లేదా మూడు నెలల వేతన సర్టిఫికేట్ ఉండాలి. రెండేళ్లుగా ఫారం 16 లేదా రెండేళ్ల ఆర్ధిక సంవత్సరపు ఐటీ రిటర్న్స్ ఉండాలి. అదే వ్యాపారస్థుడైతే మూడేళ్ల రిటర్న్స్(IT Returns) దాఖలు చేయాలి. మూడేళ్ల వ్యాపారపు బ్యాలెన్స్ షీట్, ప్రోఫిట్ అండ్ లాస్ వివరాలుండాలి. బిజినెస్ లైసెన్స్ వివరాలు సమర్పించాలి. టీడీఎస్ వివరాలు దాఖలు చేయాలి.
Also read: SSC Notification 2021: పదో తరగతి విద్యార్ఙతతో ప్రభుత్వ ఉద్యోగాలు, SSC నోటిఫికేషన్ విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి