SBI Holidays In October 2020| కరోనా వైరస్ తర్వాత బ్యాంకుల పనులలో చాలా మార్పు వచ్చింది. చాలావరకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ మీద ఆధారపడుతున్నారు. ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు పనులు ఉన్నవారు బ్యాంకు సెలవు దినాలు (Bank Holidays in October 2020) తెలుసుకోవడం ఉత్తమం. గాంధీ జయంతి, దసరా పండుగ, మిలాద్ ఉన్ నబీ ఈ నెలలోనే ఉన్నాయి.
అక్టోబర్ 4, 11, 18, 25 తేదీలలో ఆదివారాలు. ఈ రోజుల్లో బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 10, 24 తేదీలు రెండో, నాలుగో శనివారాలు.. కనుక ఆ రోజుల్లోనూ బ్యాంకులకు పబ్లిక్ హాలీడే ఉంటుంది. వీటితో పాటు అక్టోబర్ 2న గాంధీ జయంతి, అక్టోబర్ 30న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలిడే ఉంటుంది.
కాగా, దసరా పండుగకు ప్రత్యేకంగా ఈ ఏడాది బ్యాంకులకు సెలవు రాలేదు. నాలుగో శని, ఆదివారాల్లో విజయదశమి వచ్చింది. ఆర్బీఐ ఈ సెలవు ప్రకటించకపోయినా బ్యాంకులకు ఎలాగూ నాలుగో శనివారం, ఆదివారం సెలవు ఉంటుంది. ఇంకా ఏమైనా పూర్తి వివరాలు కావాలనుకుంటే రిజర్వ్ బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Bank Holidays in October 2020: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే..