LIQUOR DOOR DELIVERY: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఆర్డర్ ఇస్తే 10 నిమిషాల్లో ఇంటికే లిక్కర్..

LIQUOR DOOR DELIVERY:  లిక్కర్ తాగాలని ఉందా.. లిక్కర్ తెచ్చుకోవడానికి వైన్ షాప్ కు వెళ్లడం కష్టంగా ఉందా.. అయితే మీకో గుడ్ న్యూస్. ఇంట్లోనే ఉండి మీకిష్టమైన లిక్కర్ తాగే అవకాశం ఉంది.. మీ లాంటి వాళ్ల కోసమే హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ వినూత్నఆలోచన చేసింది. లిక్కర్ హోం డెలివరీ చేయబోతోంది.

Written by - Srisailam | Last Updated : Jun 3, 2022, 08:42 AM IST
  • మందుబాబులకు గుడ్ న్యూస్
  • ఆర్డర్ ఇస్తే 10 నిమిషాల్లో ఇంటికే లిక్కర్
  • హైదరాబాద్ సంస్థ వినూత్నఆలోచన
LIQUOR DOOR DELIVERY: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఆర్డర్ ఇస్తే 10 నిమిషాల్లో ఇంటికే లిక్కర్..

LIQUOR DOOR DELIVERY: లిక్కర్ తాగాలని ఉందా.. లిక్కర్ తెచ్చుకోవడానికి వైన్ షాప్ కు వెళ్లడం కష్టంగా ఉందా.. అయితే మీకో గుడ్ న్యూస్. ఇంట్లోనే ఉండి మీకిష్టమైన లిక్కర్ తాగే అవకాశం ఉంది.. మీ లాంటి వాళ్ల కోసమే హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ వినూత్నఆలోచన చేసింది. లిక్కర్ హోం డెలివరీ చేయబోతోంది. ఆర్డర్ ఇచ్చిన 10 నిమిషాల్లోనే మద్యాన్ని ఇంటికి సరఫరా చేస్తామమని ఇన్నొవెంట్ టెక్నాలజీస్ స్టార్టప్ సంస్థ ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి ఈ అవకాశం తెలుగు రాష్ట్రాల మందుబాబులకు లేదు. కోల్ కతాలో లిక్కర్ డోర్ డెలివరీని ప్రారంభించింది సదరు సంస్థ.

బూజీ అనే బ్రాండ్‌తో కోల్‌కతాలో లిక్కర్‌ డోర్ డెలివరీ చేయనుంది ఇన్నోవెంట్ టెక్నాలజీస్ కంపెనీ. దేశంలో ఇప్పటికే పలు సంస్థలు లిక్కర్ డోర్ డెలివరీ చేస్తున్నాయి. అయితే 10 నిమిషాల్లో డోర్ డెలివరీ చేసే చేసే సంస్థ తమదేనని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మద్యం డోర్ డెలివరీకి ఇటీవలే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎక్సైజ్ శాఖ నుంచి పర్మిషన్ తీసుకున్న సంస్థలకు అవకాశం కల్పించింది. దీంతో బెంగాల్ రాష్ట్ర ఎక్సైజ్​శాఖ అనుమతి పొందిన తర్వాత కోల్‌కతాలోని తూర్పు ప్రాంతంలో ఈ సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు ఇన్నోవెంట్​ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది.

అయితే మద్యం డోర్ డెలివరీ పొందాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. ఆన్‌లైన్‌లో లిక్కర్ ఆర్డర్ చేసేందుకు కస్టమర్లు.. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, సెల్ఫీ ఫొటోను అప్‌ లోడ్​ చేయాలి. ఏజ్ ను ధ్రువీకరించాకే వాళ్ల ఆర్జర్ ప్రాసెస్ అవుతుంది. అంతేకాదు వినియోగదారుడికి ఎంత మద్యం విక్రయించాలనే విషయంపై బెంగాల్ సర్కారు కండీషన్స్ పెట్టింది. ఆ పరిమితికి లోబడే మద్యాన్ని సరఫరా చేస్తారు. ప్రభుత్వం రూల్స్ కు అనుగుణంగానే తాము లిక్కర్ ను డోర్ డెలివరీ చేస్తామని ఇన్నోవెంట్ టెక్నాలజీస్ సంస్థ సీఈవో వివేకానంద చెప్పారు. కల్తీ మద్యం, మైనర్లకు డెలివరీ చేయబోమని ఆయన స్పష్టం చేశారు.

READ ALSO: LPG subsidy: కేంద్ర సర్కార్ భారీ షాక్.. వంట గ్యాస్‌‌పై సబ్సిడీ ఎత్తివేత.. మరిన్ని షాకులు తప్పవా! 

READ ALSO: CHARMINAR WAR: చార్మీనార్ పై కాంగ్రెస్, బీజేపీ ఫైట్.. అసలు వివాదం ఏంటీ? హైదరాబాదీలు ఏమంటున్నారు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News