Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో ముసురు పట్టుకుంది. ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు వాతావరణం ఇలాగే ఉండనుంది. నిన్న ఈశాన్య మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల వద్ద ఉన్న అల్పపీడనం ఇవాళ బలహీన పడింది. ఇటు కింది స్థాయిలోని గాలులు ముఖ్యంగా పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాగల మూడురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి.
ఇవాళ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. రేపు, ఎల్లుండి చాలా చోట్ల వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పలుచోట్ల ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి. ఇవాళ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడనున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది.
మరోవైపు ఏపీలోనూ వర్షాలు పడుతున్నాయి. ఈశాన్య మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం క్రమంగా బలహీన పడుతోంది. ఇటు కింది స్థాయిలోని గాలులు ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవనున్నాయి. మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అమరావతి, విశాఖ వాతావరణ శాఖలు తెలిపాయి.
ఇవాళ, రేపు, ఎల్లుండి పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. తీరం వెంట పెనుగాలులు ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉండనున్నాయి. మరో మూడురోజులపాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాగల మూడురోజులపాటు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఇటు రాయలసీమలోనూ ఉదయం నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవనున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. అనంతపురం, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో ఈదురుగాలులు సైతం ఉంటాయని అమరావతి, విశాఖ వాతావరణ శాఖ తెలిపాయి. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
Also read:T20 World Cup: జాతీయ జట్టులో చోటు దక్కాలంటే మాములు విషయం కాదు..యువ ఆటగాడి ఆసక్తికర వ్యాఖ్యలు..!
Also read:TS Govt: జింఖానా గ్రౌండ్ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్..నివేదిక ఇవ్వాలని ఆదేశం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి