ITR 2019-20: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి.. లేకపోతే భారీ జరిమానా!  

Last Date To File ITR 2019-20: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమమనిక. నేటి (జనవరి 10వ తేదీ)తో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్(Income Tax Returns) దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువు నేడు ముగుస్తుంది. ఇప్పటివకే పలుమార్లు ఆదాయ పన్ను దాఖలుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2021, 04:17 PM IST
  • పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమమనిక
  • రిటర్న్స్ దాఖలుకు ఇచ్చిన గడువు నేడు ముగుస్తుంది
  • భారీ మొత్తంలో జరిమానా ఎదుర్కోవలసి ఉంటుంది
ITR 2019-20: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి.. లేకపోతే భారీ జరిమానా!  

Last Date To File ITR 2019-20: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమమనిక. నేటి (జనవరి 10వ తేదీ)తో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్(Income Tax Returns) దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువు నేడు ముగుస్తుంది. ఇప్పటివకే పలుమార్లు ఆదాయ పన్ను దాఖలుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇంకా ఎవరైనా ఐటీఆర్ దాఖలు చేయలేదంటే.. తక్షణమే ఆ పని పూర్తి చేసుకోవం బెటర్. లేని పక్షంలో భారీ మొత్తంలో జరిమానా ఎదుర్కోవలసి ఉంటుంది.

ఆర్థిక సంవత్సరం 2019-20కు సంబంధించిన ఆదాయ పన్ను (Income Tax) దాఖలు చేయడానికి గత నెల చివర్లో పొడిగించిన గడువు జనవరి 10తో ముగుస్తుంది. గతేడాది జూలై 31లోపు దాఖలు చేయాల్సిన ఐటీ రిటర్న్స్‌ను ఈ ఏడాది కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా ఇదివరకే పలుమార్లు పొడిగించారు. ప్రస్తుతం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. 
Also Read: Jagananna Ammavodi Scheme: మనీ ఖాతాల్లో చేరేది ఎప్పుడంటే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

గతంలో ఐటీఆర్(ITR) నిర్ణీత గడువులోగా దాఖలు చేయని వారికి రూ.5 వేల మేర జరిమానా విధించేవారు. అయితే ఈ ఏడాది ఆ జరిమానాను రూ.10 వేలకు పెంచడం తెలిసిందే. రూ.5 లక్షలకు లోపు ఆదాయం ఉన్న తక్కువ పన్ను చెల్లింపుదారులు డెడ్‌లైన్ మిస్ అయితే రూ.1000 జరిమానా పడుతుంది.

Also Read: EPFO శుభవార్త.. మీ PF రెట్టింపు చేసుకోండి.. మరెన్నో లాభాలు!

కాగా, ఆడిట్ అవసరం లేని వారికి జనవరి 10 వరకూ గడువు ఉంది. ఆడిట్ అవసరమున్న వ్యాపార సంస్థలు, కంపెనీలకు జనవరి 31 వరకూ ఉన్న గడువు తేదీని ఫిబ్రవరి 15 వరకూ పొడిగించారు. ట్యాక్స్ ఆడిట్ నివేదికల సమర్పణకు జనవరి 15 వరకూ తాజాగా అవకాశం కల్పించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News