LIC Recruitment 2023: ఎల్ఐసీలో 9394 ఉద్యోగాలు.. అప్లై చేసేందుకు ఈరోజే చివరి తేదీ.. ఇలా చేయండి!

LIC ADO Recruitment 2023: ఎల్‌ఐసీ అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయి కొంత కాలం అవగా ఈరోజు దానికి అప్లై చేసేందుకు చివరి తేదీ, ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 10, 2023, 12:03 PM IST
LIC Recruitment 2023: ఎల్ఐసీలో 9394 ఉద్యోగాలు.. అప్లై చేసేందుకు ఈరోజే చివరి తేదీ.. ఇలా చేయండి!

LIC Recruitment 2023 Last Date: ఎల్‌ఐసీ అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 9394 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ LIC అధికారిక వెబ్‌సైట్ licindia.inలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నిజానికి అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తును 10 ఫిబ్రవరి 2023 తేదీ వరకు అంటే ఈరోజు ముగిసేలోపు అప్లై చేయాల్సి ఉంటుంది.

అనంతరం ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామ్ అనంతరం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష 12 మార్చి 2023న నిర్వహించనున్నారు, అందులో అర్హత సాదించినవారికి 8 ఏప్రిల్ 2023న మెయిన్స్ పరీక్ష నిర్వహించబడుతుంది. ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డును మార్చి 4న విడుదల చేయనున్నారు. 

ఎల్‌ఐసీ అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుకు అర్హతలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి లేదా ముంబైలోని ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి ఫెలోషిప్ అయినా కలిగి ఉండాలి. అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల కోసం ఈ రిక్రూట్‌మెంట్‌ దేశవ్యాప్తంగా జోన్ల వారీగా జరుగుతోంది. ఆసక్తి గల అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ licindia.inని సందర్శించడం ద్వారా తమ నివాస ప్రాంతం ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ఈరోజు చివరి తేదీ అంటే 10 ఫిబ్రవరి 2023 కావడంతో నిజంగా చేయలనుకున్న వారు తొందరపడండి. 

అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

ఎల్ఐసీ రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు రుసుము:
ఎస్సీ/ ఎస్టీ / కేటగిరీ దరఖాస్తుదారులు దరఖాస్తు రుసుముగా రూ. 100 చెల్లించాలి, అయితే జనరల్ కేటగిరీ అభ్యర్థులందరూ దరఖాస్తు రుసుము 750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
LIC రిక్రూట్‌మెంట్ దరఖాస్తు చేయండిలా!
ముందుగా licindia.in అధికారిక వెబ్‌సైట్‌ చేరుకోవాలి 
వెబ్‌సైట్‌ హోమ్‌పేజీలో, “కెరీర్-”రిక్రూట్‌మెంట్ ఆఫ్ అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 22-23”పై క్లిక్ చేయాలి 
రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించండి
ముందుగ IBPS పోర్టల్‌లో నమోదు చేసుకుని దరఖాస్తు చేయాలి 
రుసుము చెల్లించి, ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి 
Also Read: UPSC: సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన యూపీఎస్సీ.. 1105 పోస్టులు.. అప్లై చేసుకోండి ఇలా..!

Also Read: JEE Mains 2023 Results: జేఈఈ మెయిన్ తొలి సెషన్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News