ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని కుల్గామ్‌ ఖుద్వానిలో ఎన్‌కౌంటర్‌ జరిగింది.

Last Updated : Jul 22, 2018, 09:16 AM IST
ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని కుల్గామ్‌ ఖుద్వానిలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.  ఘటనాస్థలిలో మరికొంత మంది ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

కానిస్టేబుల్‌ కిడ్నాప్‌, హత్య

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి ఓ కానిస్టేబుల్‌ను కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. సెలవుపై ఇంటికి వచ్చిన కానిస్టేబుల్‌ సలీమ్‌ ఖాన్ ఇంట్లోకి ఉగ్రవాదులుచొరబడి ఆయన్ను గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆయన మృతదేహాన్ని శనివారం కైమోలో కనుగొన్నారు.

మరోవైపు కుప్వారా జిల్లా తాంగ్ధర్ సెక్టార్‌లో శుక్రవారం భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ ఎదురుకాల్పుల్లో ఎవరూ గాయపడలేదు.

గత ఆరునెలలుగా జమ్మూలో 100 మంది తీవ్రవాదులు, 43 మంది భద్రతా సిబ్బంది మరణించినట్లు మంత్రి హన్సరాజ్ ఓ ప్రకటనలో తెలిపారు.

 

Trending News