ఉన్నావో రేప్ కేసులో జైలు పక్షిగానే కుల్దీప్ సింగ్ సెంగార్

ఉన్నావో రేప్ కేసులో బీజేపీ బహిష్కృత  ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కు  శిక్ష ఖరారైంది.  ఆయన్ను అత్యాచార కేసులో  దోషిగా తేల్చిన కోర్టు ..  ఈ రోజు శిక్ష ఖరారు చేసింది.   గత కొన్నేళ్లుగా . .  ప్రజా ప్రతినిధిగా ఉన్న కుల్దీప్ సింగ్ సెంగార్..  పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని . .  ఆయన తరఫు న్యాయవాదులు  ధర్మాసనం ఎదుట వాదించారు. అందుకే తుది తీర్పును డిసెంబర్ 20 నాడు( మంగళవారం) ప్రకటిస్తామంటూ .. కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.

Last Updated : Dec 20, 2019, 03:55 PM IST
ఉన్నావో రేప్ కేసులో జైలు పక్షిగానే కుల్దీప్ సింగ్ సెంగార్

ఉన్నావో రేప్ కేసులో బీజేపీ బహిష్కృత  ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కు శిక్ష ఖరారైంది. ఆయన్ను అత్యాచార కేసులో దోషిగా తేల్చిన కోర్టు .. ఈ రోజు శిక్ష ఖరారు చేసింది. గత కొన్నేళ్లుగా . . ప్రజా ప్రతినిధిగా ఉన్న కుల్దీప్ సింగ్ సెంగార్.. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని . . ఆయన తరఫు న్యాయవాదులు ధర్మాసనం ఎదుట వాదించారు. అందుకే తుది తీర్పును డిసెంబర్ 20 నాడు( మంగళవారం) ప్రకటిస్తామంటూ .. కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.  
జీవిత ఖైదు.. బాధితురాలికి పరిహారం..
ఇవాళ ఈ కేసును మరోసారి విచారించిన తీస్ హజారీ కోర్టు ధర్మాసనం .. జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ప్రకటించింది. అంతే కాదు బాధితురాలి కుటుంబానికి 25 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని కుల్దీప్ సింగ్ సెంగార్ ను ఆదేశించింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కుల్దీప్ సింగ్ సెంగార్.. ఇప్పుడు అదే జైలుకు పరిమితం కానున్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రత్యేక రక్షణ కల్పించాలని తీస్ హజారీ కోర్టు సీబీఐని ఆదేశించింది. మరోవైపు ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న శశి సింగ్ పై  కోర్టు ఏమీ తేల్చలేదు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఆమెను వదిలి పెట్టింది.

ఉద్యోగం కోసం వెళితే .. అత్యాచారం . . .
బంగార్ మవూ  ఎమ్మెల్యేగా ఉన్న కుల్దీప్ సింగ్ సెంగార్ పై  గతేడాది అత్యాచారం కేసు నమోదైంది. 2017 జూన్ లో తన ఇంటికి ఉద్యోగం కోసం వచ్చిన ఓ అమ్మాయిపై  .. కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. అమ్మాయి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 376, పోస్కో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో రంగంలోకి దిగిన సీబీఐ ఈ ఏడాది అక్టోబర్ 3న ఛార్జిషీట్ దాఖలు చేసింది. అమ్మాయిని కిడ్నాప్  చేసి 9 రోజులపాటు వేర్వేరు ప్రదేశాల్లో ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని సీబీఐ .. తన ఛార్జిషీట్ లో పేర్కొంది.  

కేసులో కీలక మలుపులు ..
తొలుత బాధితురాలి ఆక్రందనను పోలీసులు పట్టించుకోలేదు. పైగా ఎమ్మెల్యే పలుకుబడికి పోలీసులు లొంగిపోయారు. దీంతో బాధితురాలి తండ్రిపై అక్రమాయుధాలు కలిగి ఉన్నాడంటూ పలు కేసులు నమోదు చేశారు. మరోసారి షాక్ కు గురైన బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు .. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్  నివాసం ముందు మూకుమ్మడి  ఆత్మహత్యకు ప్రయత్నించారు. కానీ ఆ మరుసటి రోజే పోలీస్ కస్టడీలో ఉన్న తండ్రి మృతి చెందారు. చివరకు ఈ ఏడాది ఏప్రిల్ 3న కుల్దీప్ సింగ్ సెంగార్ ను పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచార సెక్షన్ల కింద కేసులు పెట్టారు.  

బాధిత కుటుంబాన్ని అడ్డు తొలగించే యత్నం ...
రేప్ కేసు నమోదు చేయడంతో కుల్దీప్ సింగ్ అనుచరులు రెచ్చిపోయారు. ఏకంగా అత్యాచార బాధితురాలితోపాటు , ఆమె కుటుంబ సభ్యులను హత్య చేయించేందుకు ప్రయత్నించారు. కోర్టు నుంచి వెళ్తున్న ఆమె కారును .. గుర్తు తెలియని వాహనంతో ఢీకొట్టించారు. ఈ ప్రమాదంలో ఆమె అత్త, చిన్నమ్మ మృతి చెందగా .. న్యాయవాదితోపాటు అత్యాచార బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స కోసం ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.  అక్కడ ఆమె వాంగ్మూలం రికార్డు చేశారు. ప్రస్తుతం ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆమె కోలుకుంటోంది. 

పార్టీ నుంచి బహిష్కరించిన బీజేపీ 
ఉన్నావో ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎమ్మెల్యేను కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా మహిళలు డిమాండ్ చేశారు. రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్దీప్ సింగ్ సెంగార్ ను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది.

Trending News