Kolkata doctor rape case Supreme Court: కోల్ కతా హత్యాచారం ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది. ఈ ఘటనపై ఇప్పటికే నెలరోజులు కూడా గడిచిపోయింది. ఈక్రమంలో సోమవారం సుప్రీంకోర్టులో ట్రైనీ డాక్టర్ ఘటన మరోసారి విచారణకు వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పలు వ్యాఖ్యలు చేసింది. ఆగస్టు 9 న జరిగిన ఘటనపై ప్రస్తుతం వరకు జరిగిన దర్యాప్తు.. కొత్త స్టేటస్ రిపోర్ట్ నివేదిక సమర్పించాలని సీబీఐ కి కోర్టు ఆదేశాలిచ్చింది.
అంతేకాకుండా.. కేసును వచ్చే మంగళవారంకు వాయిదా వేస్తు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఘటనాస్థలంలో సేకరించిన సాంపిల్స్ పై సీబీఐ అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో ఎయిమ్స్ కు పంపి..కొత్తగా నివేదిక ఇవ్వాలని కూడా.. సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశించినట్లు తెలుస్తోంది. సంఘటన జరిగిన ప్రదేశలోని సీసీ ఫుటేజీ .. సీబీఐకి ఇచ్చారా..లేదా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఇదిలా ఉండగా.. ఘటన తర్వాత బాధితురాలి శరీరంపై గాయాలు ఉన్నాయని కూడా.. సుప్రీంకోర్టుకు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పరీక్ష జరిపిన ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఎయిమ్స్‌కి పంపి పరిశీలించాలని సీబీఐ నిర్ణయించిందని తెలిపారు. మరోవైపు సీఐఎస్ఎఫ్ సిబ్బందికి.. మమతా ప్రభుత్వం సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆర్జీ కర్ ఆసుపత్రి వద్ద మూడు మహిళా సీఐఎస్ఎఫ్ కంపెనీలు ఉంటే ఒక కంపెనీకి మాత్రమే వసతులు కల్పించారని ప్రస్తావించింది.
కాగా సిబ్బందికి సరైన వసతులు కల్పిస్తున్నామంటూ .. వెస్ట్ బెంగాల్ తరపు లాయర్లు చెప్పుకొచ్చారు. దీనికి కౌంటర్ గా.. మరల కేంద్రం.. మూడు వారాల తర్వాత సీఐఎస్ఎఫ్‌కి సదుపాయాలు కల్పించారని కేంద్రం తెలిపింది. మరోవైపు బెంగాల్‌లో వైద్యుల భద్రతకు తీసుకున్న చర్యలపై బెంగాల్ ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసింది. అంతేకాకుండా.. కోల్ కతా లో జూనియర్ వైద్యుల నిరసనల వల్ల.. 23 మంది పెషెంట్లు చనిపోయారని కూడా వెస్ట్ బెంగాల్ ఆరోగ్య శాఖ రిపోర్టును వెస్ట్ బెంగాల్ తరపు లాయర్ లు.. కోర్టులో ప్రవేశపెట్టారు.
మరోవైపు జూనియర్ డాక్టర్లను మరల విధుల్లోకి చేరాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అదేవిధంగా విధుల్లో చేరిన వారిపైఎలాంటి చర్యలు తీసుకొవద్దని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన కూడా విధుల్లోకి చేరకుంటే.. చర్యలు తీసుకొవచ్చని కూడా ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది. మంగళవారం సాయంత్రం 5 వరకు డాక్టర్లు విధుల్లో చేరేందుకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
అదే విధంగా.. డాక్టర్ తరపు లాయర్.. తమ వద్ద ఉన్న ఫోరెన్సిక్ నిర్ధారణ రిపోర్ట్ ఉందని, దీని ప్రకారం 9:30 గంటలకు వైద్యురాలి మృతదేహం వెలుగులోకి వచ్చిందని కోర్టుకు తుషార్ మెహతా వెల్లడించారు. వైద్యురాలి జీన్స్, లో దుస్తులు తొలగించి ఉన్నాయని, అవి సమీపంలో ఉన్నాయని, వైద్యురాలు అర్ధనగ్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక శరీరంపై గాయం గుర్తులు కూడా ఉన్నాయని రిపోర్టులలో ఉన్నాయని తుషార్ మెహతా పేర్కొన్నారు.
31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన తర్వాత పశ్చిమ్ బెంగాల్ తరఫున సీనియర్ లాయర్.. కపిల్ సిబల్ కోర్టులో వాదిస్తూ.. దర్యాప్తు స్టేటస్ రిపోర్టులను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిందని చెప్పారు. అయితే తనకు ఎలాంటి నివేదిక అందలేదని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు.
సీల్డ్ కవర్లో సమర్పించిన నివేదికను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కోల్ కతా ఘటనపై.. పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఉన్న స్టేటస్ రిపోర్టును తమ ముందు ఉంచాలని కూడా అత్యున్నత ధర్మాసనం పేర్కొంటూ.. కేసును మంగళవారానికి వాయిదా వేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.