Kolkata incident victim family spoke about shocking shocking 3 phone calls: కోల్ కతాలో ఆగస్టు 9 న వెలుగులోకి వచ్చిన ఘటన దేశంలో పెను దుమారంగా మారింది. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై అన్ని వర్గాల నుంచి నిరసనలు మిన్నంటాయి. ఇప్పటికి కూడా కోల్ కతా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఏకంగా భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. దీనిపై తాజాగా, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముసైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఘటనలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కీలక నిందితుడు సంజయ్ రాయ్ తో పాటు, మరో ఆరుగురికి కూడా ఇప్పటికే పాలీగ్రాఫ్ టెస్టులు పూర్తి అయినట్లు తెలుస్తోంది.
మరోవైపు కోల్ కతాలో జూనియర్ డాక్టర్ కు సంఘీభావంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు కాస్త రణరంగంగా మారాయి. పోలీసులు విద్యార్థులపై భాష్ఫవాయువు, వాటర్ కెన్ లలో దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ట్రైనీ ఘటన కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. విద్యార్థులపై పోలీసుల దాడులకు నిరసనగా.. బీజేపీ నిన్న(బుధవారం) వెస్ట్ బెంగాల్ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కూడా హింసాత్మకంగా మారింది. మరోవైపు మమతా బెనర్జీ.. వెస్ట్ బెంగాల్ తగలబడితే.. పలు రాష్ట్రాలలో కూడా మంటలు చెలరేగుతాయంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో జూనియర్ డాక్టర్ హత్యకు సంబంధించి.. మరిన్ని షాకింగ్ విషయాలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
పూర్తి వివరాలు..
కోల్ కతాలో జూనియర్ డాక్టర్ ఘటనలో మరిన్ని షాకింగ్ విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆగస్టు 9 న యువతి ఆర్ జీ కర్ సెమినార్ లో తెల్లవారు జామున విగత జీవిగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కానీ.. తల్లిదండ్రులకు మాత్రం ఉదయం 10.53 నిమిషాలకు ఫోన్ చేసినట్లు తాజాగా, కోర్టులో యువతి కుటుంబీకులు వెల్లడించారు. ఈ క్రమంలో కోర్టులో.. ట్రైనీ డాక్టర్ ఘటన జరిగిన రోజున ఆర్ జీ కర్ ఆస్పత్రి నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ను పూస గుచ్చినట్లు కోర్టు ఎదుట వెల్లడించారు.
తొలుత ఆర్ జీకర్ ఆస్పతి నుంచి.. ఫోన్ కాల్ వచ్చింది.. తమ బిడ్డకు జ్వరం వచ్చిందని, తొందరగా రావాలని చెప్పారు. రెండోసారి కాల్ చేసి.. మీ బిడ్డ ఆరోగ్యం విషమంగా ఉందని, మూడో సారి కాల్ చేసి.. వెంటనే ఆస్పత్రికి రావాలని.. మీబిడ్డ సూసైడ్ కు పాల్పడిందని కూడా ఆస్సత్రి సిబ్బందికాల్ చేసి చెప్పారని నాటి షాకింగ్ ఘటనను తల్లిదండ్రులు కోర్టుకు వెల్లడించారు. చివరకు ఆస్పత్రికి వెళ్లి చూసేసరికి తమ బిడ్డను విగత జీవిగా కన్పించిందని కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇదిలా ఉండగా.. తొలి నుంచి ఆర్ కర్ ఆస్పత్రి వర్గాలు యువతి మరణం పట్ల అనుమానాలకు తావిచ్చేలా ప్రవర్తించినట్లు ఇదివరకే సీబీఐ దర్యాప్తులో బైటపడింది. యువతి చనిపోయిన తర్వాత మరో గదిలోకి మార్చడం, సెమినార్ లో కొన్ని మరమ్మత్తులు చేపట్టడం, క్రైమ్ సీన్ ను సీల్ చేయకుండా ఆస్పత్రి వర్గాలు కావాలని ఎలాంటి ఆనవాళ్లు లభించకుండా చేశాయని కూడా సీబీఐ ఆరోపించింది.
ఈ నేపథ్యంలో ట్రైనీ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. కోల్ కతా సర్కారును, పోలీసులను, ఆర్ జీకర్ ఆస్పత్రి సిబ్బందిపై కూడా తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. ఈ మూడు ఫోన్ కాల్స్ ఘటనతో ట్రైనీ డాక్టర్ ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.