South Cine Industry: ఢిల్లీ: కరోనావైరస్ ( Coronavirus ) అన్ని రంగాలపై విపరీతమైన ప్రభావాన్ని చూపింది. దేశంలో లాక్డౌన్ విధించిన నాటినుంచి దాదాపు నాలుగు నెలలుపైనే సినిమాళ్లు మూతబడే ఉంటున్నాయి. షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయి. దీంతో సినీ పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో అన్‌లాక్-3లో భాగంగా సినిమాహాళ్లు తెరవడంపై సానుకూల నిర్ణయమే ఉంటుందని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ( G. Kishan Reddy ) తెలిపారు. మంగళవారం కిషన్‌రెడ్డి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రొడ్యూసర్లు, ఎగ్జిబ్యూటర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ భారీగా నష్టపోయిందని, షూటింగ్‌లు, సినిమాహాళ్లు తెరవడంపై ఈ నెల 31న కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు. ఆగస్టు 1 నుంచి 25శాతం ఆక్యుపెన్సీతో సినిమాహాళ్లు తెరవడానికి బాలీవుడ్ నిర్మాణ సంస్థలు అంగీకరిస్తూ లేఖలు రాశాయని ఆయన గుర్తుచేశారు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ రాష్ట్రాల యూనిట్లు, ఎగ్జిబ్యూటర్లు, ప్రొడ్యూసర్ల కౌనిళ్ల ద్వారా హోంశాకు లేఖలు పంపిస్తే.. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళతానని ఆయన పేర్కొన్నారు. Also read: CM Shivraj Singh: నా దుస్తులు నేనే ఉతుక్కుంటున్నా..
South Indian Film Fraternity (Producers & Exhibitors) Interacted with Hon'ble Union Minister of State for Home Affairs, Government of India, Shri @kishanreddybjp over videoconferencing to discuss the way ahead for the industry in light of the pandemic and #Unlock3 guidelines. pic.twitter.com/uWTwUqLnIE
— Office of G. Kishan Reddy (@KishanReddyOfc) July 28, 2020
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వచ్చే సినీ పరిశ్రమపై సానుకూల నిర్ణయమే ఉంటుందని, కేంద్రం నుంచి ఎంతమేర సాయం చేయగలమో అంత చేస్తామని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జీఎస్టీ, ప్రాపర్టీ ట్యాక్స్ తదితర విషయాలపై కేంద్ర ఆర్థిక, ప్రసార శాఖ మంత్రులతో మాట్లాడతానని ఆయన ప్రొడ్యూసర్లు, ఎగ్జిబ్యూటర్లకు హామీఇచ్చారు. Also read: Ram Temple: రామ మందిరం భూమి పూజకు అతిథుల జాబితా ఇదే