KGF 2 Actor Died: KGF చాప్టర్ 2 ఫేమ్ నటుడు మోహన్ జునేజా ఇక లేరు..!

KGF 2 Actor Die: ప్రముఖ హాస్య నటుడు KGF-2 ఫేమ్‌ మోహన్ జునేజా కన్నుమూశారు. మోహన్ జునేజా గత కొద్ది రోజులుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 7, 2022, 10:44 AM IST
  • KGF 2 ఫేమ్ నటుడు ఇక లేరు
  • ప్రముఖ ఆర్టిస్ట్ మోహన్ జునేజా మృతి
  • చికిత్స పొందుతూ మృతి
KGF 2 Actor Died: KGF చాప్టర్  2  ఫేమ్ నటుడు మోహన్ జునేజా ఇక లేరు..!

KGF 2 Actor Mohan Judeja Died: ప్రముఖ హాస్య నటుడు KGF-2 ఫేమ్‌ మోహన్ జునేజా కన్నుమూశారు. మోహన్ జునేజా గత కొద్ది రోజులుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన అనారోగ్య కారణంతో చిక్కబాణవర సప్తగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 7న మరణించాడు. కన్నడలో జోగి సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మోహన్ జునేజా కన్నడలో వందకుపైగా సినిమాలో నటించారు. ఈ మధ్యే విడుదలైన KGF చాప్టర్ 2 మోహన్ జునేజా ప్రధాన పాత్రలో నటించారు. జునేజా చెలట్టా చిత్రంలో మధుమగా పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడలోని పలు చిత్రాల్లో హాస్యనటుడుగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. మోహన్ జునేజా చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వెన్నునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చిక్కబాణవరంలోని సప్తగిరి ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ..  శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మోహన్‌కు తల్లి, భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు

Also Read: Harish rao On Rahul: పంజాబ్ రైతులు ఈడ్చి తన్నారు.. రాహుల్ కు హరీష్ రావు కౌంటర్

Also Read: Madhya Pradesh Fire Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం... ఏడుగురు సజీవ దహనం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News