కేరళలో విజృంభిస్తున్న కరోనా వైరస్, కారణం అదేనంటున్న జెనోమిక్స్ కన్సార్టియం

Keral Corona Update: కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ జీనోమ్ సీక్వెన్సింగ్ మానిటరింగ్ ఏజెన్సీ కీలక వ్యాఖ్యలు చేసింది. మతపరమైన సమావేశాల కారణంగా కోవిడ్ 19 ఉధృతి పెరిగిందనే వ్యాఖ్యలు కలవరం రేపుతున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 9, 2021, 01:53 PM IST
కేరళలో విజృంభిస్తున్న కరోనా వైరస్, కారణం అదేనంటున్న జెనోమిక్స్ కన్సార్టియం

Keral Corona Update: కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ జీనోమ్ సీక్వెన్సింగ్ మానిటరింగ్ ఏజెన్సీ కీలక వ్యాఖ్యలు చేసింది. మతపరమైన సమావేశాల కారణంగా కోవిడ్ 19 ఉధృతి పెరిగిందనే వ్యాఖ్యలు కలవరం రేపుతున్నాయి.

కేరళలో మరోసారి కరోనా వైరస్(Corona virus) విజృంభిస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వ జీనోమ్ సీక్వెన్సింగ్ మానిటరింగ్ కంపెనీ కీలక వ్యాఖ్యలు చేసింది. మతపరమైన సమావేశాలు, ధార్మిక కార్యక్రమాల ద్వారానే కరోనా వైరస్ ఉధృతి పెరిగిందని ఇండియన్ సార్స్ కోవ్ 2 జెనోమిక్స్ కన్సార్టియం డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మతపరమైన సమావేశాలకు అనుమతించడం సరైన నిర్ణయం కాదని..అవసరమైన సేవల్ని మాత్రమే ప్రారంభించాల్సి ఉందన్నారు. ఈ తరహా కార్యక్రమాల వల్ల రోజుకు 13-20 వేల వరకూ కేసులు పెరిగాయన్నారు. కేరళలో కూడా కొత్త వేరియంట్ గుర్తించినప్పటికీ..90 శాతం కేసులు డెల్టా వేరియంటేనని చెప్పారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave) ప్రారంభం కావచ్చని అనురాగ్ అగర్వాల్ స్పష్టం చేశారు. అందుకే తక్షణం వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. 

కేరళలో తాజాగా 18 వేల 607 కేసులు నమోదు కాగా, 93 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు పాజిటివిటీ రేటు 13.87 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 40 శాతం కేరళ నుంచే కావడం గమనార్హం. ఈ నేపధ్యంలో కేరళ ప్రభుత్వం(Kerala government)అప్రమత్తమైంది. ఎక్కువమందికి వ్యాక్సిన్ అందించేందుకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్(Vaccination Drive) ప్రారంభించినట్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్(Pinarayi Vijayan) తెలిపారు. ఆగస్టు 31 వరకూ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుందన్నారు. 

Also read: శ్రావణం ప్రారంభం, ఈ నెలలో మంచి ముహూర్తాలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News