టోల్‌ప్లాజా సిబ్బందితో ఎమ్మెల్యే వాగ్వాదం.. బారికేడ్ ధ్వంసం

బాధ్యతగా ఉండాల్సిన ఓ ప్రజాప్రతినిధి టోల్‌ప్లాజా సిబ్బందితో గొడవకు దిగారు.

Last Updated : Jul 18, 2018, 03:01 PM IST
టోల్‌ప్లాజా సిబ్బందితో ఎమ్మెల్యే వాగ్వాదం.. బారికేడ్ ధ్వంసం

బాధ్యతగా ఉండాల్సిన ఓ ప్రజాప్రతినిధి టోల్‌ప్లాజా సిబ్బందితో గొడవకు దిగారు. టోల్ ప్లాజా బారికేడ్‌లను విరగొట్టాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమరాల్లో రికార్డు కావడంతో..ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే పీసీ జార్జ్.. మంగళవారం రాత్రి ప్రయాణిస్తూ త్రిశూర్ టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే కారు రాగానే టోల్‌ప్లాజా సిబ్బంది.. టోల్ రుసుము కోసం కారును ఆపి.. బారికేడ్ వేశారు. దీంతో ఎమ్మెల్యే జార్జ్ కారులో నుంచి దిగి వచ్చి తన కారునే ఆపుతావా అంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అడ్డుగా ఉన్న బారికేడ్‌ను అనుచరులతో పాటు కలిసి విరగొట్టారు. ఆతరువాత టోల్ రుసుం చెల్లించకుండానే ఎమ్మెల్యే కారు వెళ్లిపోయింది. సీసీటీవీ రికార్డుల ఆధారంగా జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Trending News