ప్రజల వద్దకే 'కరోనా' ఆస్పత్రి..!!

'కరోనా వైరస్'.. మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. అన్ని ప్రాంతాల్లో వ్యాపిస్తూ.. భయాందోళన సృష్టిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మరోవైపు లక్షణాలు లేకుండా వస్తున్న కరోనా మహమ్మారి కారణంగా పలు రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఆయా రాష్ట్రాలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కుంటున్నాయి.

Last Updated : Apr 25, 2020, 04:43 PM IST
ప్రజల వద్దకే 'కరోనా' ఆస్పత్రి..!!

'కరోనా వైరస్'.. మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. అన్ని ప్రాంతాల్లో వ్యాపిస్తూ.. భయాందోళన సృష్టిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మరోవైపు లక్షణాలు లేకుండా వస్తున్న కరోనా మహమ్మారి కారణంగా పలు రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఆయా రాష్ట్రాలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కుంటున్నాయి.

కర్ణాటకలో ఇప్పటి వరకు 60 శాతం కరోనా పాజిటివ్ కేసులన్నీ లక్షణాలు లేనివే కావడం గమనించాల్సిన అంశం. దీంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిని కరోనా వైరస్ రోగులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం  తీర్చిదిద్దింది. అటు ఢిల్లీ తరహాలో ప్లాస్మా థెరపీని కూడా అనుసరించేందుకు వైద్యులు  ప్రయత్నిస్తున్నారు. 

మరోవైపు కర్ణాటకలోని మైసూరులో  కేఎస్ఆర్టీసీకి చెందిన బస్సులను కరోనా సంచార  ఆస్పత్రులుగా తీర్చిదిద్దారు. కొన్ని బస్సులను మొబైల్ క్లినిక్‌లుగా తయారు చేశారు. వాటి ద్వారా నేరుగా గ్రామాల్లోకి వెళ్లి.. అక్కడే పరీక్షలు నిర్వహించనున్నారు. రోగులకు పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని నిర్ధారణ అయితే .. వెంటనే వారిని కరోనా అస్పత్రులకు తరలిస్తారు. కరోనా లక్షణాలు ఉన్న రోగులు తమకు తెలియకుండానే ఈ వ్యాధిని ఇతరులకు వ్యాప్తి చెందించే అవకాశం ఉంటుంది. కాబట్టి.. సంచార క్లినిక్‌ల ద్వారా దీనికి పరిష్కారం దొరుకుందని ప్రభుత్వం ఈ సరికొత్త ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది.

కర్ణాటకలో ఇప్పటి వరకు 463 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. అందులో 18 మంది చనిపోయారు. కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా రికవరీ కాలేదు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News