Weekend Curfew: కర్నాటకలో కఠినమైన ఆంక్షలు, ఇక నుంచి వీకెండ్ కర్ఫ్యూ అమలు

Weekend Curfew: కోవిడ్ నియంత్రణకు కర్నాటక మరిన్ని కట్టుదిట్టమైన చర్యలకు దిగుతోంది. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న ఆ రాష్ట్రం ఇక నుంచి వీకెండ్ కర్ఫ్యూను అమలు చేయనుంది. మరోవైపు ఆక్సిజన్ కోసం ఆ రాష్ట్రం ఎదురుచూస్తోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 24, 2021, 03:43 PM IST
 Weekend Curfew: కర్నాటకలో కఠినమైన ఆంక్షలు, ఇక నుంచి వీకెండ్ కర్ఫ్యూ అమలు

Weekend Curfew: కోవిడ్ నియంత్రణకు కర్నాటక మరిన్ని కట్టుదిట్టమైన చర్యలకు దిగుతోంది. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న ఆ రాష్ట్రం ఇక నుంచి వీకెండ్ కర్ఫ్యూను అమలు చేయనుంది. మరోవైపు ఆక్సిజన్ కోసం ఆ రాష్ట్రం ఎదురుచూస్తోంది.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (Covid Virus) సంక్రమణ వేగంగా విస్తరిస్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపధ్యంలో ఆయా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ ఇతర కఠినమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇందులో భాగంగా కర్నాటక ప్రభుత్వం ( Karnataka government) నైట్ కర్ఫ్యూ( Nght Curfew) అమలు చేస్తోంది. ఇప్పుడు తాజాగా కోవిడ్ సంక్రమణ నేపధ్యంలో మరిన్ని కట్టుదిట్టమైన ఆంక్షల్ని విధిస్తోంది.

కర్నాటక ప్రభుత్వం ఇక నుంచి వీకెండ్ కర్ఫ్యూని (Weekend Curfew) అమలు చేస్తోంది. వీకెండ్ కర్ప్యూ శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభమైంది. సోమవారం ఉదయం 6 గంటల వరకూ కొనసాగనుంది. ప్రతి వారం ఇకపై కర్ఫ్యూ ఉండనుంది. శని, ఆదివారాల్లో ఉదయం 6 గంటల్నించి పది గంటల వరకూ కూరగాయలు, ఇతర అత్యవసరాల కొనుగేళ్లకు అవకాశముంటుంది. విమానాలు, రైళ్లలో వెళ్లే ప్రయాణీకులు టికెట్ చూపించాల్సి ఉంటుంది. హోటల్, రెస్టారెంట్లలో పార్శిల్ సర్వీసులు మాత్రమే ఉంటాయి. బస్సులు, టెంపోలు, క్యాబ్స్‌లో 50 శాతం కెపాసిటీతో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. శని, ఆదివారాల్లో మెట్రో రైళ్లను (Metro Trains) పూర్తిగా నిలిపివేస్తారు. వివాహాలకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి అనుమతి ఉంటుంది.  

మరోవైపు ఇతర రాష్ట్రాల్లాగే కర్నాటకలో ఆక్సిజన్ కొరత (Oxygen Shortage) ఏర్పడింది. రాష్ట్రానికి 1471 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి యడ్యూరప్ప( Yediyurappa) కేంద్ర ప్రభుత్వానికి (Central government) విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో రాష్ట్రంలో విజయవంతంగా జరుగుతోందని..అదే సమయంలో ఆక్సిజన్ వినియోగం రోజురోజుకీ పెరుగుతోందన్నారు. ఏప్రిల్ 30 తరువాత రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలు ఖాళీ అయిపోతాయన్నారు. 

Also read: SBI Report on Coronavirus: పొంచి ఉన్న కరోనా ముప్పు, ఆందోళన కల్గిస్తున్న ఎస్బీఐ నివేదిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News