కర్ణాటక: కర్ణాటకలో హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ హంగ్ ఏర్పడితే ఏఏ పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాయనే విషయమై అప్పడే ఊహాగానాలు మొదలయ్యాయి. 'హంగ్ అసెంబ్లీ' కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌ను కొత్త ఆలోచనలో పడేయగా.. అన్ని పార్టీలు వర్కవుట్లు మొదలుపెట్టాయి.
బీజేపీ పెద్ద పార్టీగా అవతరిస్తే జేడీఎస్ మద్దతు ఇవ్వనుందట. అయితే సీఎంగా యెడ్యూరప్ప బదులు కేంద్ర మంత్రి అనంతకుమార్ అయితే జేడీఎస్ మద్దతుకు అవకాశం ఉంది. కమలదళం ఆ పేరునూ పరిశీలిస్తోందట. ఇక కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా విజయం సాధిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు జేడీఎస్ మద్దతు తీసుకునే అవకాశముంది. కాంగ్రెస్ తరఫున సీఎంగా సిద్ధరామయ్యకు బదులు మరొకరిని ఎంపిక చేసే అవకాశముంది. జేడీఎస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే కాంగ్రెస్ స్వయంగా మద్దతిచ్చి కుమారస్వామి సీఎం అయ్యేందుకు అంగీకరిస్తుందట.