కర్ణాటకలో బీజేపీ గెలుపు తథ్యం: అమిత్ షా

కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా శనివారం ధీమా వ్యక్తం చేశారు.

Last Updated : Apr 28, 2018, 05:16 PM IST
కర్ణాటకలో బీజేపీ గెలుపు తథ్యం: అమిత్ షా

కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా శనివారం ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వం కూలడానికి కౌంట్‌డౌన్‌ మొదలయ్యిందన్నారు. 'సిద్దరామయ్యకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. మేము కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ 12 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యింది. బాదామి నుండి మీకు ఓటమి తప్పదు' అని భాగల్‌కోట్‌లోని బహిరంగ సభలో అమిత్‌ షా ప్రసంగించారు. అభివృద్ధిలో దేశంలోనే కర్ణాటక మొదటి స్థానం సాధిస్తుందని హామీనిచ్చారు. యడ్యురప్పను గెలిపిస్తే కచ్చితంగా కర్ణాటకను అభివృద్ధి పరిచే దిశగా పనిచేస్తారని అన్నారు. నేను ఎక్కడికి వెళ్లినా కర్ణాటకలో ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని అన్నారు.

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సిద్ధరామయ్య చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పారిపోయారని ఈ సందర్భంగా అమిత్‌షా అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా సిద్ధరామయ్య మీద ఆధారపడి ఉందని, అయితే ఆయన బాదామి నియోజక వర్గానికి పారిపోయారని అమిత్‌షా వ్యాఖ్యానించారు. కాగా శుక్రవారం మొదలైన అమిత్ షా నాలుగు రోజుల ఎన్నికల ప్రచారం.. సోమవారం ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలతో ముగుస్తుంది.

అమిత్ షా - రాహుల్ మాటల యుద్ధం

కర్ణాటకలో రాహుల్ గాంధీ, అమిత్ షాలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇరువురి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జాతీయ గీతాన్ని గౌరవించలేని వారికి రాజకీయాల్లో చోటు లేదని అమిత్ షా మండిపడగా, గాలి జనార్ధన్ రెడ్డి బ్రదర్స్ పైన మోదీ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న  యడ్యురప్ప, అమిత్ షా తనయుడి గురించి ప్రధాని ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.

Trending News