Karnataka Corona Update: కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. కర్నాటకలో పరిస్థితి మరీ ఘోరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నిమిషానికి పదిమంది కరోనా బారిన పడుతున్నారంటే..పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
కర్ణాటకలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) శరవేగంగా విజృంభిస్తోంది. గత 20 రోజులుగా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. రాజధాని బెంగళూరు ( Bengaluru)నగరంలో ప్రతి నిమిషానికి దాదాపుగా 7 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా (Karnataka) ప్రతి నిమిషానికి 10 మంది కరోనా బారిన పడుతున్నారు. బెంగళూరులో ప్రతిరోజూ 7 నుంచి 10 వేల కేసులు వస్తున్నాయి. ప్రతి గంటకూ ఒక కరోనా మరణం నమోదవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరు నాటికి రోజుకు సుమారు 2 వందల మంది మరణించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
కర్ణాటక(Karnataka)లో పరిస్థితి తీవ్రత దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం (Karnataka government) కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. బెంగళూరులో ఎంట్రీ ఇవ్వాలనుకుంటే..ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ ( RTPCR Test) కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. మరోవైపు చాలా ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ (Night Curfew) అమల్లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ మొదటి వారంలో 164 కరోనా మరణాలు నమోదు కాగా, రెండో వారంలో ఆ సంఖ్య 315కు పెరిగింది. మూడో వారంలో అంటే ఏప్రిల్ 17వ తేదీ నాటికి 224 మంది మరణించారు. కాగా బెంగళూరులో ఈ నెల మొదటి వారంలో 99 మంది, రెండోవారంలో 215 మంది, మూడో వారంలో ఇప్పటికే 130 మందిని కోవిడ్ రక్కసి పొట్టనబెట్టుకుంది. రాష్ట్రంలో ప్రతి నిమిషానికి సుమారు 90 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid Tests) చేస్తున్నారు. 100 మందికి పరీక్షలు చేస్తే అందులో 12 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోందంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందనేది తెలుసుకోవచ్చు.
Also read: Remdesivir Injections: రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అక్రమంగా విదేశాలకు సరఫరా, విచారిస్తున్న పోలీసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Karnataka Corona Update: కర్నాటకలో ప్రతి నిమిషానికి పది మందికి కరోనా వైరస్