Karnataka: పట్టపగలు ఇంట్లోనే కన్నడ నటుడు సురేంద్ర హత్య

కర్ణాటకలో పట్టపగలు దారుణ హత్య జరిగింది. కన్నడు నటుడు సురేంద్ర బంట్వాల్ హత్యకు గురయ్యాడు. పట్టపగలు ఇంట్లోనే హత్యకు గురవడంతో ఈ సంఘటన కలకలం రేపుతోంది. 

Last Updated : Oct 21, 2020, 11:33 PM IST
Karnataka: పట్టపగలు ఇంట్లోనే కన్నడ నటుడు సురేంద్ర హత్య

కర్ణాటక ( Karnataka ) లో పట్టపగలు దారుణ హత్య జరిగింది. కన్నడు నటుడు సురేంద్ర బంట్వాల్ ( Kannada Actor Surendra Bantwal  Murder ) హత్యకు గురయ్యాడు. పట్టపగలు ఇంట్లోనే హత్యకు గురవడంతో ఈ సంఘటన కలకలం రేపుతోంది. 

కర్నాటకలోని బంట్వాల్ తాలూకా బీసీ రోడ్డులో ఉంటున్నకన్నడ నటుడు సురేంద్రను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. పట్టపగలు ఇంట్లో ఉన్న సమయంలోనే హత్య చేయడంతో ఈ ఘటన సంచలనం కల్గిస్తోంది. బీసీ రోడ్డులోని తన అపార్ట్ మెంట్లో ఉన్న సమయంలో ఇవాళ పట్టపగలు కొందరు గుర్తు తెలియని దుండగులు వచ్చి సురేంద్రను హత్య చేశారు. 

సురేంద్రకు రౌడీ నేపధ్యముండటంతో ఇతనిపై గతంలో కర్నాటక పోలీసులు ( Karnataka police ) రౌడీ షీటర్ కూడా తెరిచారు. సురేంద్ర కన్నడతో పాటు తుళు చిత్రాల్లో ( Tulu movies ) కూడా నటించాడు. కొంతమంది వ్యక్తులతో సురేంద్రకు ఆర్ధిక లావాదేవీలున్నట్టు తెలుస్తోంది.  మరోవైపు బీజేపీ నేతల్ని బెదిరించిన కేసులో జైలుకు వెళ్లి..ఇటీవలే బెయిల్ పై వచ్చినట్టు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. 

తుళు చిత్రం ఛలి పోలిలు ( Chali polilu ) లో సురేంద్ర పోషించిన కీలకపాత్రకు ప్రేక్షకుల్నించి విపరీతమైన స్పందన వచ్చింది. సమాజానికి ఓ సందేశంలా పనిచేసింది. ఈ సినిమా 2014లో విడుదలై సంచలనం కల్గించింది. తరువాత కన్నడ సినిమా సవర్ణ దీర్ఘ సంధి ( Savarna Dirgha sandhi ) లో నటించాడు. సురేంద్రకు రాజకీయాల నేపధ్యం కూడా ఉంది. ఇటీవలే అతను కాంగ్రెస్ పార్టీలో చేరాడు. బీజేపీ కార్యకర్తల్ని కత్తితో బెదిరించిన వీడియో బయటకు రావడంతో సురేంద్ర వార్తల్లో కెక్కాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. సురేంద్రను అతని సన్నిహితులే హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. Also read: Covid19 Test: అత్యంత చవకగా కోవిడ్ నిర్ధారణ పరీక్ష, ఖరగ్ పూర్ ఐఐటీ ఘనత

Trending News