Kangana Ranaut News: పంజాబ్ లోని కీరత్ పురలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కారును కొందరు రైతులు అడ్డగించారు. చంఢీఘడ్ – ఉనా హైవైపై ఉన్న కీరత్ పుర సాహిబ్ వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో రైతులు వచ్చి.. తన కారును అడ్డుకున్నారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
అయితే కంగనా రనౌత్ కారుపై దాడి జరిగినట్లు తమకు సమాచారం అందలేదని రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ తెలిపారు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిశాకే దానిపై స్పందిస్తానని ఆయన అన్నారు.
క్షమాపణ చెప్పాలని డిమాండ్..
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ధర్నా చేస్తున్న సమయంలో.. నటి కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో నటి కంగనా రనౌత్ పంజాబ్ వస్తున్న విషయాన్ని తెలుసుకున్న నిరసన కారులు అడ్డగించారు. అయితే పంజాబ్ లోకి చేరుకున్న తర్వాత తన కారుపై ఓ గుంపు దాడి చేసిందని.. అయితే వాళ్లు రైతులమని చెప్పుకున్నట్లు ఇన్ స్టాగ్రామ్ లో కంగనా రనౌత్ వెల్లడించింది.
Punjab | Farmers stopped actor Kangana Ranaut’s car near Ropar & protested against her over her statements on farmers protest
"If the police personnel were not present here, lynching would've happened, shame on these people," says Kangana Ranaut pic.twitter.com/Rd37EQfpfT
— ANI (@ANI) December 3, 2021
Also Read: Viral Video: కదులుతున్న రైలు నుంచి దూకేసిన మహిళ.. ప్రాణాలతో కాపాడిన రైల్వే పోలీస్
Also Read: Omicron Variant: దేశంలో ఒమిక్రాన్ కలకలం..ఢిల్లీ ఆస్పత్రిలో 12 మంది అనుమానితులు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook