గాంధీ, జిన్నా.. ఇద్దరూ సమానమే

ఈ మధ్యకాలంలో అలీగఢ్ విశ్వవిద్యాలయంలో పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ ఆలీ జిన్నా చిత్రాన్ని ఉంచే విషయంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. 

Last Updated : May 4, 2018, 09:43 PM IST
గాంధీ, జిన్నా.. ఇద్దరూ సమానమే

ఈ మధ్యకాలంలో అలీగఢ్ విశ్వవిద్యాలయంలో పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ ఆలీ జిన్నా చిత్రాన్ని ఉంచే విషయంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రవీణ్ నిషాద్ ఇదే విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "బీజేపీ జిన్నా పేరుతో రాజకీయాలు చేస్తోంది. కానీ నా అభిప్రాయంలో వారిద్దరూ సమానమే. భారత విభజన ముందు వారిద్దరూ కలిసే స్వాతంత్ర్యం కోసం పోరాడారు.

కానీ జాతీయవాదం పేరుతో ఒక మతానికి చెందిన వారు వివాదాలు చేస్తున్నారు. 2019లో ఎన్నికలు వస్తున్న క్రమంలో కొందరు ప్రజలను మతం, కులం ప్రాతిపదికిన వేరు చేయాలని చూస్తున్నారు. మేం ఈ దేశ పౌరులం. అలాగే ముస్లిం సోదరులు కూడా ఈ దేశ పౌరులే. ఈ దేశంలో ఎవరు ఏ మతంలో పుట్టినా.. అందరికీ సమాన హక్కులు ఉంటాయి" అని ప్రవీణ్ నిషాద్ తెలిపారు

"మనం భగత్ సింగ్ పేరు చెప్పేటప్పుడు.. ఆయనతో కలిసి పోరాడిన అష్ఫాఖుల్లా ఖాన్, వీర్ అబ్దుల్ హమీద్ పేర్లు కూడా చెబుతాం. అది చరిత్ర. కాని బీజేపీ కొందరు పేర్లను గుర్తుపెట్టుకొని.. మరికొందరి పేర్లు మర్చిపోవాలని కోరుకుంటోంది. మళ్లీ దేశంలో రాజకీయ లబ్ది కోసం చిచ్చు పెట్టాలని చూస్తోంది. వారు ఆడే ఆటలు మేం సాగనివ్వం" అన్నారు. 

Trending News