JEE Mains 2021: జేఈఈ మెయిన్స్ 2021 షెడ్యూల్ ఇవాళ సాయంత్రం విడుదల కానుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ ( JEE Mains Schedule ) లో తప్పులు దొర్లి..గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. షెడ్యూల్‌కు సంబంధంచిన సమాచార బుల్లెటిన్‌లో తప్పులు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( National testing agency ) వెబ్‌సైట్ నుంచి షెడ్యూల్ తొలగించింది. తాజాగా మరో షెడ్యూల్ విడుదల చేయడానికి నిర్ణయించింది.
జేఈఈ మెయిన్స్ 2021 ( Jee Mains 2021 ) షెడ్యూల్‌ను ఇవాళ సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ( Central minister Ramesh pokhriyal ) తెలిపారు. ఇవాళ ప్రకటించనున్న తేదీల్ని ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. జేఈఈ మెయిన్స్‌ను ఈ సారి నాలుగు విడతల్లో నిర్వహించనున్నట్లు బులెటిన్‌లో తెలిపారు. ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు మొదటి పరీక్ష, మార్చి 2న రెండో పరీక్ష, ఏప్రిల్ 3న మూడో పరీక్ష, మే 4న నాలుగో పరీక్ష నిర్వహించనున్నట్లు బుల్లెటిన్ వెల్లడించింది. జేఈఈ మెయిన్స్-2021 రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయమై గందరగోళం రావడంతో..తాజాగా సాయంత్రం మరో బుల్లెటిన్‌తో కొత్త షెడ్యూల్ విడుదల చేయనుంది. Also read: Kerala Local Body Election Results 2020: ఒక్క ఓటుతో మేయర్ అభ్యర్థి ఓటమి