JEE Main 2021 Feb Answer Key: జేఈఈ మెయిన్ 2021 ఫిబ్రవరి ఎగ్జామ్ ఫైనల్ ఆన్సర్ కీ వచ్చేసింది, డైరెక్ట్ లింక్ మీకోసం

JEE Main 2021 February Final Answer Key: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021 (JEE Main Result 2021) ఫలితాల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫలితాల విడుదలకు ముందు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ 2021 ఫిబ్రవరి పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేసింది.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 8, 2021, 03:50 PM IST
JEE Main 2021 Feb Answer Key: జేఈఈ మెయిన్ 2021 ఫిబ్రవరి ఎగ్జామ్ ఫైనల్ ఆన్సర్ కీ వచ్చేసింది, డైరెక్ట్ లింక్ మీకోసం

JEE Main 2021 Result Live Updates: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021 (JEE Main Result 2021) ఫలితాల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలు జాతీయ మీడియాలు సైతం ఫిబ్రవరిలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాలు నేడు విడుదల కానున్నాయని చెబుతున్నాయి. అయితే ఫలితాల విడుదలకు ముందు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ 2021 ఫిబ్రవరి పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేసింది.  

ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐలో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 23 నుంచి 26 తేదీల మధ్య ఈ ఏడాది తొలి విడత జేఈఈ మెయిన్ 2021 పరీక్షను నిర్వహించింది. దేశ వ్యాప్తంగా 6,61,761 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ, 5.5 లక్షల మంది ఫిబ్రవరిలో తొలి విడత పరీక్షకు హాజరయ్యారు. జేఈఈ మెయిన్ ఫలితాలు(JEE Main 2021 Result) విడుదలకు ముందు ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.

JEE Main Feb 2021 Final Anwer Key కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఏడాది నాలుగు పర్యాయాలు జేఈఈ మెయిన్స్ నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ ఫోఖ్రియాల్ నిశాంక్ జనవరి నెలలో ప్రకటించారు. జేఈఈ మెయిన్ ఫిబ్రవరిలో నిర్వహించిన పరీక్ష ఫలితాలు నేడు వెలువడనున్నాయి. అధికారిక వెబ్‌సైట్‌ https://jeemain.nta.nic.in/ లో ఫలితాలు, ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తే మీకు ఇక్కడ అందించనున్నాం.

Also Read: JEE Main Results 2021: జేఈఈ మెయిన్ 2021 ఫలితాలు విడుదలకు సర్వం సిద్ధం, రిజల్ట్ ఇలా చేసుకోండి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News